UGADI ASTHANAM AT SRI GOVINDARAJA SWAMY TEMPLE ON APRIL 9 _ ఏప్రిల్ 9న శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఉగాది ఆస్థానం
Tirupati, 31 March 2024: Koil Alwar Tirumanjanam in Sri Govindaraja Swamy temple in Tirupati on April 4 in connection with Ugadi Asthanam on April 9.
Koil Alwar Tirumanjanam will be held on Thursday morning. Koil Alwar Tirumanjanam will be held from 7 am to 9 am. Ater purifying the temple premises, walls, roof, worship materials etc. with water, holy water mixed with spices is spread throughout the temple.
After that, the devotees will be allowed to have darshan from 9.30 am onwards.
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI
ఏప్రిల్ 9న శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఉగాది ఆస్థానం
– ఏప్రిల్ 4న ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
తిరుపతి, 2024 మార్చి 31: తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఏప్రిల్ 9న ఉగాది పర్వదినం సందర్భంగా ఆస్థానం జరుగనుంది.
ఇందులో భాగంగా సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాల, కొలువు, పంచాంగ శ్రవణం, అర్చన నిర్వహిస్తారు. సాయంత్రం 4.30 నుండి 6 గంటల వరకు పంచాంగ శ్రవణం, ఉగాది ఆస్థానం జరుగనుంది.
కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఏప్రిల్ 4వ తేదీ కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఏప్రిల్ 9న ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ.
ఇందులో భాగంగా గురువారం తెల్లవారుజామున సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాలసేవ, కొలువు, పంచాంగశ్రవణం నిర్వహిస్తారు. ఉదయం 7 నుండి 9 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరుగనుంది. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేసిన అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేస్తారు. అనంతరం భక్తులను ఉదయం 9.30 గంటల నుండి దర్శనానికి అనుమతిస్తారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.