ANNAMAIAH BIRTH ANNIVERSARY CELEBRATIONS FROM APRIL 4 TO 8 _ ఏప్రిల్ 4 నుండి 8 వ తేదీ వరకు అన్నమయ్య వర్థంతి ఉత్సవాలు

METLOTSAVAM AT ALIPERI ON APRIL 4

Tirumala, 31 March 2024: In connection with the celebration of the 521st Death anniversary of the Telugu Padakavitha Pitamaha Sri Thallapaka Annamacharya, the Melotsavam will be held with grandeur under the auspices of the TTD Annamacharya Project on April 4 at Alipiri Pada Mandapam in Tirupati.

Annamacharya project artists and bhajan mandal artists will perform Annamacharya’s “Saptagiri Sankirtana Gosthiganam” from 6 am.  After that, Metlapuja will be done.  After that the Bhajanaparas climb Tirumala on foot singing Sankeertans.  

The Bhajan mandal artistes from all over the state will participate in this program.

As part of Annamacharya’s Death anniversary celebrations, a Goshtiganam and musical program will be held at Narayanagiri Gardens in Tirumala on April 5.  

For three days from April 6 to 8, literary seminars will be organized at Annamacharya Kalamandiram in Tirupati, Dhyanamandiram in Tallapaka and spiritual and devotional music programs at the 108 feet Annamayya statue in the saint poet’s native place.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

ఏప్రిల్ 4 నుండి 8 వ తేదీ వరకు అన్నమయ్య వర్థంతి ఉత్సవాలు

– ఏప్రిల్ 4న అలిపిరిలో మెట్లోత్సవం

తిరుప‌తి, 2024 మార్చి 31: పదకవితా పితామహుడు శ్రీ తాళ్లపాక అన్నమయ్య 521వ వర్ధంతిని పురస్కరించుకుని తిరుపతిలోని అలిపిరి పాదాల మండపం వద్ద ఏప్రిల్ 4వ తేదీ టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో మెట్లోత్సవం వైభవంగా జరుగనుంది.

అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు, భజన మండళ్ల కళాకారులు ఉదయం 6 గంటల నుంచి అన్నమాచార్యుల వారి ”సప్తగిరి సంకీర్తనా గోష్ఠిగానం” నిర్వహిస్తారు. అనంతరం శాస్త్రోక్తంగా మెట్లపూజ జరుగనుంది. ఆ తరువాత కళాకారులు సంకీర్తనలు గానం చేస్తూ కాలినడకన తిరుమలగిరులను అధిరోహిస్తారు. టీటీడీ ఉన్నతాధికారులు, రాష్ట్రం నలుమూలల నుంచి విచ్చేసిన‌ భజన మండళ్ల కళాకారులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.

అన్నమాచార్య వర్ధంతి ఉత్సవాల్లో భాగంగా ఏప్రిల్ 5వ తేదీన తిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనంలో గోష్టిగానం, సంగీత కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఏప్రిల్ 6 నుండి 8వ తేదీ వరకు మూడు రోజుల పాటు తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో సాహితీ సదస్సులు, తాళ్లపాకలోని ధ్యానమందిరం, 108 అడుగుల అన్నమయ్య విగ్రహం వద్ద ఆధ్యాత్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.