UGADI FEST OBSERVED IN ALL LOCAL TEMPLES _ టిటిడి స్థానికాలయాల్లో ఉగాది వేడుకలు
Tirupati, 13 Apr. 21: The festival of Ugadi was observed with religious aplomb in all local temples after TTD in and around Tirupati on Tuesday.
The temples are decked with flowers and raw mangoes, fruits to welcome Plavanama Ugadi.
The Vedic Scholars rendered panchanga sravanam in all temples followed by Ugadi Asthanam.
The DyEOs of respective temples participated.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
టిటిడి స్థానికాలయాల్లో ఉగాది వేడుకలు
తిరుపతి, 2021 ఏప్రిల్ 13: తిరుపతి, పరిసర ప్రాంతాల్లోని టిటిడి స్థానిక ఆలయాల్లో మంగళవారం శ్రీ ప్లవనామ సంవత్సర ఉగాది వేడుకలు జరిగాయి. తిరుచానూరులోని శ్రీపద్మావతి అమ్మవారి ఆలయం, తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం, శ్రీకోదండరామాలయం, శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయం, అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయాల్లో ఉగాది సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
శ్రీ కోదండరామాలయంలో :
తిరుపతిలోని శ్రీ కోదండరామాలయంలో సాయంత్రం 4 నుండి 5 గంటల వరకు ఉగాది ఆస్థానం, పంచాంగ శ్రవణం జరిగింది. ఈ సందర్భంగా శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామివారు మూలవర్లకు, ఉత్సవర్లకు వస్త్రసమర్పణ చేశారు.
ఈ కార్యక్రమంలో ఆలయ ప్రత్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీమతి పార్వతి, ఏఈవో శ్రీ దుర్గరాజు, సూపరింటెండెంట్ శ్రీ జి.రమేష్, టెంపుల్ ఇన్‌స్పెక్టర్లు శ్రీ మునిరత్నం, శ్రీ జయకుమార్, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో :
తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల వరకు స్నపనతిరుమంజనం, సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు పంచాంగ శ్రవణం, ఉగాది ఆస్థానం నిర్వహించారు.
తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో :
తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాల, కొలువు, పంచాంగ శ్రవణం, అర్చన నిర్వహించారు. సాయంత్రం 5.30 నుంచి రాత్రి 6.30 గంటల వరకు ఉగాది ఆస్థానం చేపట్టారు.
శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయం :
శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఉదయం 9 నుండి 11 గంటల వరకు ఉగాది ఆస్థానం, పంచాంగ శ్రవణం నిర్వహించారు.
అప్పలాయగుంట శ్రీ ప్రసన్నవేంకటేశ్వరస్వామి ఆలయంలో :
అప్పలాయగుంట శ్రీ ప్రసన్నవేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఉదయం 8.30 నుండి 10.30 గంటల వరకు ఉగాది ఆస్థానం, పంచాంగ శ్రవణం జరిగింది.
తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.