UGADI GREETINGS EXTENDED _ తెలుగు ప్రజలకు టీటీడీ చైర్మన్ ఉగాది శుభాకాంక్షలు

Tirumala, 12 Apr. 21: TTD Trust Board Chairman Sri YV Subba Reddy extended Telugu Ugadi greetings to all the Telugu devotees located in the country and across the globe.

He expressed that the Plavanama Ugadi brings all cheers and prosperity to the entire humanity.

He sought the devotees to observe the festival following Covid norms and appealed to all those who have crossed 45 years to get vaccinated.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

తెలుగు ప్రజలకు టీటీడీ చైర్మన్ ఉగాది శుభాకాంక్షలు

తిరుమల 12 ఏప్రిల్ 2021: తెలుగు సంవత్సరాది ఉగాది సందర్భంగా టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి సోమవారం ఒక ప్రకటనలో శుభాకాంక్షలు తెలియజేశారు.

కొత్త సంవత్సరంలో శ్రీ వేంకటేశ్వర స్వామి దయతో ప్రజలందరికీ సంపూర్ణ ఆరోగ్యం, ఆనందం కలగాలని ఆయన కోరారు.

సంక్లిష్ట పరిస్థితుల్లో ప్రజలందరూ క్రమశిక్షణతో మెలగుతూ, కోవిడ్ నిబంధనలు పాటించాలని శ్రీ సుబ్బారెడ్డి విజ్ఞప్తి చేశారు. మనం ఆరోగ్యం గా ఉంటూ సమాజాన్ని కూడా ఆరోగ్యం గా ఉంచడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ప్రభుత్వ నిబంధనలు అనుసరించి 45 ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని శ్రీ సుబ్బారెడ్డి పిలుపునిచ్చారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది