UGADI IS A FESTIVAL OF MOTHER NATURE – HDPP CHIEF _ ప్రకృతి పండుగ ఉగాది : హిందూ ధర్మప్రచార పరిషత్‌ కార్యదర్శి ఆచార్య కె.రాజగోపాలన్

Tirupati, 13 Apr. 21: Ugadi is usually revered as the festival of Mother Nature since the perfect spring season begins during this time, said HDPP Secretary Sri Rajagopalan. 

Ugadi Mahotsavam was observed with grandeur in Mahati Auditorium in Tirupati on Tuesday. The Plavanama Ugadi was welcomed in a befitting way Mangaladhwani, Veda Swasti, Bhakti Sangeet, Traditional fancy dress. Speaking during the occasion Sri Rajagopalan expressed his confidence that Plavanama Ugadi will bring prosperity and health in the lives of humanity across the world. 

While renowned veteran scholar Sri Gopavajjhala Balasubrahmanya Shastry rendered Panchanga Sravanam. 

Later prizes were distributed to winners in Ugadi competitions to employees. The program concluded with the distribution of Ugadi Pacchadi.

DyEO Welfare Sri Anandaraju, Epic Studies Coordinator Sri Hemanth Kumar and other officers were also present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ప్రకృతి పండుగ ఉగాది : హిందూ ధర్మప్రచార పరిషత్‌ కార్యదర్శి ఆచార్య కె.రాజగోపాలన్
 
మహతిలో ఘనంగా ఉగాది సంబరాలు
 
తిరుప‌తి, 2021 ఏప్రిల్ 13: తెలుగు వారి నూతన సంవత్సరాది అయిన ఉగాది పూర్తిగా ప్రకృతితో మమేకమై జరుపుకునే పండుగ అని, షడ్రుచుల సమాహారమైన ఉగాది పచ్చడి ఇందుకు నిదర్శనమని హిందూ ధర్మప్రచార పరిషత్‌ కార్యదర్శి ఆచార్య కె.రాజగోపాలన్ అన్నారు. టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌, సంక్షేమ విభాగం సంయుక్త ఆధ్వర్యంలో తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో మంగళవారం ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి.
 
ఈ సందర్భంగా ఆచార్య కె.రాజగోపాలన్ మాట్లాడుతూ ఉగాది పచ్చడిలోని రుచులు జీవనగమనంలో ఎదురయ్యే అన్నిరకాల అనుభూతులను తెలియజేస్తాయన్నారు. అనంతమైన కాలచక్రాన్ని, దాని స్థితిగతులను ఈ పండుగ ద్వారా తెలుసుకోవచ్చన్నారు. శ్రీ ప్లవ నామ సంవత్సరంలో భక్తులందరికీ శ్రీవారి ఆశీస్సులు ఉండాలని, అందరికీ మంచి జరగాలని ఆకాంక్షించారు.  పంచాంగశ్రవణం వల్ల సౌభాగ్యం, సంపద, దీర్ఘాయుష్షు కలిగి వ్యాధి బాధలు తొలగుతాయని చెప్పారు. 
 
ఈ సందర్భంగా పురాణ పండితులు శ్రీ గోపావఝల బాలసుబ్రహ్మణ్య శాస్త్రి పంచాంగ శ్రవణం చేస్తూ తిథి, వార, నక్షత్ర, యోగ, కరణములను తెలుసుకోవడమే పంచాంగమన్నారు. పూర్వం రాజులు  ప్రతిరోజూ పంచాంగ శ్రవణం చేసేవారని, ఇది ఎంతో పుణ్యఫలమని అన్నారు. శ్రీ ప్లవనామ సంవత్సరంలో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆరోగ్యవంతులుగా ఉంటారని తెలిపారు. శ్రీమహావిష్ణువు రూపమైన వేంకటేశ్వరుని భక్తితో సేవిస్తే అన్నీ శుభాలే కలుగుతాయన్నారు. అనంతరం ఆయా రాశుల వారికి ఈ సంవత్సరంలో కలిగే ఫలాలను తెలియజేశారు.
 
అనంతరం పంచాంగకర్తను శ్రీవారి ప్రసాదం, శాలువతో సన్మానించారు.
 
ఈ సందర్భంగా అందరికీ ఉగాది పచ్చడి పంపిణీ చేశారు.
 
ముందుగా ఎస్వీ సంగీత కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు చక్కగా మంగళధ్వని వినిపించారు. ఎస్వీ ఉన్నత వేదాధ్యయన సంస్థ ఆధ్వర్యంలో వేదపండితులు వేదస్వస్తి నిర్వహించారు. హిందూ ధర్మప్రచార పరిషత్‌ కళాకారులు భక్తి సంకీర్తనలు ఆలపించారు.
 
అనంతరం టిటిడి ఉద్యోగుల పిల్లలతో తెలుగు వైతాళికుల వేషధారణ పోటీలు నిర్వహించారు. ఆ తరువాత ఉగాది సందర్భంగా టిటిడి ఉద్యోగులకు, వారి కుటుంబ సభ్యులకు నిర్వహించిన క్విజ్‌, పద్యపఠనం, స్వీయ కవిత పోటీలు, పాటల పోటీల్లో ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులు అందజేశారు.
 
ఈ కార్యక్రమంలో టిటిడి సంక్షేమ విభాగం డెప్యూటీ ఈవో శ్రీ ఆనందరాజు, ధార్మిక విజ్ఞాన పరీక్షల ప్రత్యేకాధికారి    డా. హేమంత్ కుమార్, ఇతర అధికార ప్రముఖులు, ఉద్యోగులు, భక్తులు పాల్గొన్నారు.
 
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.