UGADI KOIL ALWAR TIRUMANJANAM IN TIRUMALA TEMPLE ON APRIL 6 _ ఏప్రిల్ 6న శ్రీవారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

Tirumala, 3 Apr. 21: The traditional temple cleansing fete, Koil Alwar Tirumanjanam will be observed in Tirumala temple on April 6 in view of Telugu New Year’s Day Ugadi on April 13.

This cleaning ritual is observed four times in a year, on the Tuesday falling before the festivities including Vaikuntha Ekadasi, Annual Brahmotsavams, Anivara Asthanam and Telugu Ugadi.

On Tuesday, the temple, sub-temples inside Tirumala temple, puja utensils, roofs, walls, ceilings will be cleansed with an aromatic mixture called Parimalam which will be sprayed all over. This amalgamation acts as a disinfectant and this fete will be observed between 6am and 9am.

While the cleansing process is on, the Mula Murthi will be covered with a white veil. After the cleaning process of the temple is completed, the veil is removed and remaining rituals and pujas will be carried out to the presiding deity by the Archakas.

The devotees will be allowed for darshan of Sri Venkateswara Swamy after the special pujas on that day.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI 

ఏప్రిల్ 6న శ్రీవారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

 తిరుమల, 03 ఏప్రిల్‌ 2021: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఏప్రిల్ 13వ తేదీన శ్రీ ప్ల‌వ‌నామ సంవత్సర ఉగాది ఆస్థానాన్ని పురస్కరించుకుని ఏప్రిల్ 6వ తేదీన మంగళవారంనాడు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జరుగనుంది.

సాధారణంగా సంవత్సరంలో నాలుగుసార్లు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ. ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు మంగళవారం ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.
   
ఏప్రిల్ 6న ఉదయం 6 నుండి ఉదయం 11 గంటల వరకు ఈ ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని అర్చకులు ఆగమోక్తంగా నిర్వహిస్తారు. ఆలయంలోని ఆనందనిలయం మొదలుకొని బంగారువాకిలి వరకు, శ్రీవారి ఆలయం లోపల ఉప దేవాలయాలు, ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుభ్రంగా కడుగుతారు. శుద్ధి పూర్తి అయిన అనంతరం నామకోపు, శ్రీ చూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర పరిమళ జలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేస్తారు. ప్రత్యేక పూజ, నైవేద్యం కార్యక్రమాలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. మధ్యాహ్నం 12. గంటల నుండి భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.