UNION FINANCE MINISTER OFFERS PRAYERS IN TIRUMALA SHRINE _ శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి గౌ|| శ్రీమతి నిర్మలా సీతారామన్

TIRUMALA, 20 OCTOBER 2022: The Union Finance Minister Smt Nirmala Sitaraman offered prayers in Tirumala temple on Thursday.

She was received by TTD Trust Board Chairman Sri YV Subba Reddy and EO Sri AV Dharma Reddy on her arrival at the Tirumala temple and later taken to the darshan of Sri Venkateswara Swamy.

After darshan, she was offered Vedaseervachanam in Ranganayakula Mandapam by Vedic pundits followed by the presentation of Theertha Prasadams, laminated photo of Srivaru.

The Finance Minister of Andhra Pradesh Sri Rajendranath Reddy, MP Dr Gurumurthy and others were also present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి గౌ|| శ్రీమతి నిర్మలా సీతారామన్

అక్టోబ‌రు 20, తిరుమల 2022: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి గౌ|| శ్రీమతి నిర్మలా సీతారామన్ గురువారం ఉదయం విఐపి బ్రేక్‌లో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

ముందుగా ఆల‌యం వ‌ద్ద‌కు చేరుకున్న కేంద్ర మంత్రికి టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అధ్య‌క్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డి, ఈవో శ్రీ‌ ఎవి.ధ‌ర్మారెడ్డి సంప్ర‌దాయ‌బ‌ద్ధంగా స్వాగ‌తం ప‌లికారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వ‌చ‌నం చేశారు. ఈ సంద‌ర్భంగా శ్రీమతి నిర్మలా సీతారామన్ కు  శ్రీవారి తీర్థప్రసాదాలు, చిత్రపటం, కాఫీటేబుల్ బుక్ అంద‌జేశారు.

ఈ కార్య‌క్ర‌మంలో రాష్ట్ర ఆర్థిక మంత్రి శ్రీ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ఎంపి డాక్టర్ గురుమూర్తి, టిటిడి మాజీ బోర్డు స‌భ్యులు శ్రీ భానుప్ర‌కాష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.