UNIQUENESS OF SANJEEVARAYA_ సంజీవని తెచ్చిన సంజీవరాయడు

Vontimitta, 27 March 2018: Lord Hanuman is worshipped vontimitta as Sri Sanjevaraya Swamy. Hanuman temple is located opposite to main entrance of the Kodanda Rama temple. There is no murti of Hanuman in the sanctum sanctorum of the main temple. This is very rare because in all Sri Rama temples, Hanuman is present near his feet.

This is because Lord Sri Rama visited this area when he was in exile along with Sita and Lakshmana. It is during the period when Lord Hanuman did not meet Lord Sri Rama.

But as Lord Sri Rama is incomplete without Lord Anjaneya, the latter settled as Sanjeevaraya outside main temple


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

సంజీవని తెచ్చిన సంజీవరాయడు

మార్చి 27, ఒంటిమిట్ట, 2018: ఒంటిమిట్టలోని శ్రీ ఆంజనేయస్వామివారు సంజీవరాయడుగా భక్తులకు దర్శనమిస్తున్నారు. సంజీవరాయని ఆలయ పురాణ ప్రాశస్త్యం ఇలా ఉంది.

ఒంటిమిట్ట గుడిలో సీతాలక్ష్మణులు ఇరువైపులా ఉండగా కోదండం ధరించి శ్రీరామచంద్రుడు దర్శనమిస్తాడు. ఇది అరణ్యవాస కాలం నాటి దృశ్యం. అప్పటికి ఇంకా శ్రీరామచంద్రుని దర్శనం హనుమంతునికి కాలేదు. ఆ కారణం చేతనే ఒంటిమిట్ట గుడిలో ఆంజనేయస్వామి లేడంటారు. రామాలయం అంటే భూమికి దిగిన వైకుంఠమని, రాముని బంటును కావున ఎదురుగా ఉండి సేవ చేసుకుంటానని ఆంజనేయస్వామి చెప్పినట్టు పురాణాల ద్వారా తెలుస్తోంది. అందుకే ఒంటిమిట్ట గుడికి ఎదురుగా సంజీవరాయడుగా కొలువుదీరి ఉన్నాడు. రామరావణ యుద్ధంలో వానరులు మరణించినపుడు, లక్ష్మణుడు మూర్చపోయినప్పుడు రెండుసార్లు హిమాలయ పర్వతాలు దాటి మహేంద్రగిరికి వెళ్లి నాలుగు రకాల సంజీవని మూలికలను ఆంజనేయుడు తెచ్చినట్టు పురాణ కథనం. కావున ఇక్కడిస్వామివారికి సంజీవరాయడని పేరు వచ్చింది.

చెరువు కట్ట మీద కూడా ఆంజనేయస్వామివారు కొలువై ఉన్నారు. నీటి వల్లగానీ, వరిపొలంలో తిరుగుతున్నపుడు గానీ, ఈ బాటలో యాత్ర చేస్తున్నప్పుడు గానీ ప్రాణభయం కలగకుండా ఈ ఆంజనేయస్వామి కాపాడతారని భక్తుల నమ్మకం. ఇక్కడి స్వామివారు శారీరక మానసిక రోగాలు పోగొడుతూ భక్తులను అనుగ్రహిస్తున్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.