TTD GEARS UP FOR 35th SANATANA DHARMIC EXAMS ON MARCH 31_మార్చి 31న సనాతన ధార్మిక విజ్ఞాన పరీక్షలకు ఏర్పాట్లు

Tirupati, 27 Mar. 18: The 35th Sanatana Dharmic exams under the aegis of Hindu Dharma Prachara Parishad (HDPP) wing of TTD will be conducted on March 31.

According to HDPP Secretary Sri Ramakrishna Reddy, TTD has been conducting this exams from the past 34 years to inculcate the values embedded in Hindu Sanatana Dharma among children. This year these exams will be conducted in 629 centres which includes 499 in AP, 126 in Telengana and 4 in Chennai. About 55,354 students are set ready to write the exams.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

మార్చి 31న సనాతన ధార్మిక విజ్ఞాన పరీక్షలకు ఏర్పాట్లు

మార్చి 27, తిరుపతి, 2018: విద్యార్థుల్లో ధార్మిక విజ్ఞానాన్ని పెంపొందించేందుకు ఉద్దేశించిన సనాతన ధార్మిక విజ్ఞాన పరీక్షలను మార్చి 31వ తేదీన నిర్వహించేందుకు ఏర్పాట్లు చేపడుతున్నట్టు టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌ కార్యదర్శి శ్రీ ఎ.రామకృష్ణారెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10.30 నుండి 12.30 గంటల వరకు ఈ పరీక్షలు జరుగనున్నాయి.

ఇప్పటివరకు 34 విడతల్లో ఈ పరీక్షలు జరిగాయి. 35వ విడత పరీక్షలను ఆంధ్రప్రదేశ్‌లో 499, తెలంగాణలో 126, చెన్నై నగరంలో 4 కలిపి మొత్తం 629 కేంద్రాల్లో నిర్వహిస్తారు. 6 నుంచి 9వ తరగతి వరకు చదువుతున్న 55,354 మంది విద్యార్థిని విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరుకానున్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.