DEVOTEES THRILLED BY VAIKUNTA DWARA DARSHAN _ SRINIVASAMANGAPURAM TEMPLE _ శ్రీనివాసమంగాపురంలో వైకుంఠద్వార దర్శనంతో పులకించిన భక్తులు ; టిటిడి స్థానిక ఆలయాలలో వైభవంగా వైకుంఠ ఏకాదశి

GRAND CELEBRATIONS OF VAIKUNTA EKADASI AT TTD SUB TEMPLES

Tirupati,29 December 2017 ; The commencement of the Vaikunta dwaram darshan at the Sri Kalyana Venkateswara swamy temple at Srinivasa Mangapuram thrilled the devotees who came in large number when the V-dwaram was opened after daily and dhanurmasam rituals at 5.00 AM.TTD officials said that as part of Vaikunta Dwadasi , Vaikunta dwaram will be kept open till night and Chakrasnanam will be also performed at the temple pushkarini in the morning of December 30.

Similar vaikunta Ekadasai and Dwadasi darshan through Vaikunta dwaram will also be conducted at the Appalayagunta Sri Prasanna Venkateswara swami temple today and tommorow and also the Chakrasnanam on Saturday . Similarly V Ekadasi and Dwadasi celebrations were afoot at Sri Veda narayanaswami temple Nagulapuram, Sri Govindaraja swami vari Temple and Sri Kodandarama Temple.


ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

శ్రీనివాసమంగాపురంలో వైకుంఠద్వార దర్శనంతో పులకించిన భక్తులు ; టిటిడి స్థానిక ఆలయాలలో వైభవంగా వైకుంఠ ఏకాదశి

తిరుపతి, 29 డిసెంబరు 2017 ; టిటిడికి అనుబంధంగా ఉన్న శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఏర్పాటుచేసిన వైకుంఠ ద్వార దర్శనంతో భక్తులు పులకించిపోయారు. శుక్రవారం ఉదయం 5.00 గంటలకు ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి వైకుంఠ ద్వారాన్ని ప్రారంభించారు. అప్పటినుంచి భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి స్వామివారిని దర్శించుకుని వైకుంఠ ద్వార ప్రవేశం చేశారు.

ద్వాదశి రోజున కూడా వైకుంఠ ద్వార దర్శనం ఉంటుంది. ద్వాదశి సందర్భంగా శనివారం ఉదయం 8.00 నుంచి 9.30 గంటల మధ్య ఆలయం ఎదురుగా గల పుష్కరిణిలో చక్రస్నానం వేడుకగా జరుగనుంది. ఈ కార్యక్రమంలో డెప్యూటీ ఈవో శ్రీ వెంకటయ్య, ఇతర అధికారులు పాల్గొన్నారు.

అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఉదయం 5.00 గంటల నుంచి భక్తులకు సర్వదర్శనం ప్రారంభమైంది. ద్వాదశి సందర్భంగా శనివారం ఉదయం 10.00 గంటలకు చక్రస్నానం ఘనంగా జరుగనుంది. తితిదే ప్రత్యేకశ్రేణి డెప్యూటీ ఈవో శ్రీమతి చెంచులక్ష్మి, ఏఈవో శ్రీరాధాకృష్ణ పాల్గొన్నారు.

తిరుపతిలోని శ్రీ కోదండరామాలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వారం శ్రీసీతలక్ష్మణ సమేత శ్రీకోదండరాములవారి ఉత్సవమూర్తులను వేంచేపుచేసి ఆస్థానం నిర్వహించారు. శ్రీగోవిందరాజస్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.

అదేవిధంగా నారాయణవనంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయం, చంద్రగిరిలోని శ్రీ కోదండరామాలయం, కార్వేటినగరంలోని శ్రీవేణుగోపాలస్వామివారి ఆలయం, పిఠాపురంలోని శ్రీపద్మావతి సమేత వేంకటేశ్వరస్వామివారి ఆలయం, కీలపట్ల శ్రీ కోనేటిరాయస్వామివారి ఆలయం, బెంగుళూరులోని శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయాల్లో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. విశేష సంఖ్యలో భక్తులు విచ్చేసి స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.