GOKULASTAMI ASTHANAM ON AUGUST 15 AND UTLOTSAVAM ON AUGUST 16 IN TIRUMALA_ తిరుమలలో ఆగస్టు 15న గోకులాష్టమి ఆస్థానం, 16న ఉట్లోత్సవం

Tirumala, 29 July 2017: In connection with the festival of Gokulastami, Asthanam will be observed on August 15 in the hill shrine and Utlotsavam on August 16 in Tirumala with religious ecstasy by TTD.

On August 15, Ekanta Tirumanjanam to Ugra Srinivasa Murthy, Sridevi, Bhudevi, Sri Krishna Swamy will be performed at Bangaru Vakili followed by Dwadasa Aradhanam and Gokulastami Asthanam will be performed between 8pm and 10pm.

On August 16, the processional deity of Sri Malayappa Swamy on Golden Tiruchi and Sri Krishna Swamy on another Tiruchi around the four mada streets takes place and Utlotsavam is performed. TTD has cancelled Kalyanotsavam, Unjal Seva, Arjitha Brahmotsavam, Vasanthotsavam and Sahasradeepalankara Seva on this day.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

తిరుమలలో ఆగస్టు 15న గోకులాష్టమి ఆస్థానం, 16న ఉట్లోత్సవం

జూలై 29, తిరుమల, 2017 : కలియుగ ప్రత్యక్షదైవమైన శ్రీ వేంకటేశ్వరస్వామివారిని సాక్షాత్తు ద్వాపరయుగపురుషుడైన శ్రీకృష్ణునిగా స్మరించుకుని ఆగస్టు 15వ తేదీన శ్రీకృష్ణజన్మాష్టమి సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో గోకులాష్టమి ఆస్థానం ఘనంగా నిర్వహించనున్నారు.

శ్రీవారి ఆలయంలోని బంగారు వాకిలి ముఖ మండపంలో రాత్రి 8 నుండి 10 గంటల వరకు గోకులాష్టమి ఆస్థానం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా బంగారు సర్వభూపాల వాహనంపై శ్రీకృష్ణస్వామివారిని వేంచేపు చేసి నివేదనలు సమర్పిస్తారు. శ్రీ ఉగ్రశ్రీనివాసమూర్తికి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లకు, శ్రీకృష్ణస్వామివారికి ఏకాంత తిరుమంజనం నిర్వహిస్తారు. అనంతరం ద్వాదశారాధనం చేపడతారు.

కాగా, ఆగస్టు 16న తిరుమలలో ఉట్లోత్సవాన్ని వైభవంగా నిర్వహిస్తారు. మధ్యాహ్నం ఈ ఉత్సవాన్ని తిలకించడానికి శ్రీ మలయప్పస్వామివారు బంగారు తిరుచ్చిపై, శ్రీకృష్ణస్వామివారు మరో తిరుచ్చిపై తిరుమాడ వీధులలో విహరిస్తారు. యువకులు ఎంతో ఉత్సాహంతో ఉట్లను కొడుతూ స్వామివార్లకు ఆనందాన్ని చేకూర్చుతారు.

ఈ ఉత్సవాన్ని పురస్కరించుకొని ఆగస్టు 16న శ్రీవారి ఆలయంలో నిర్వహించే ఆర్జిసేవలైన కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మూెత్సవం, వసంతోత్సవం మరియు సహస్రదీపాలంకార సేవలను టిటిడి రద్దు చేసింది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.