VAIBHAVOTSAVAMS AND KALYANAMS FOR THE SAKE OF GLOBAL DEVOTEES WELFARE-TTD CHAIRMAN _ ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులకు శ్రీవారి ఆశీస్సులు : టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డి

HYDERABAD, 15 OCTOBER 2022: TTD has been conducting Sri Venkateswara Vaibhavotsavams and Srinivasa Kalyanams across the country as well overseas, following the instructions given by the Honourable CM of Andhra Pradesh Sri YS Jaganmohan Reddy for the well-being of Srivari Devotees across the world, said TTD Chairman Sri YV Subba Reddy.

Addressing the huge gathering of devotees who thronged to witness Srivari Kalyanam on the last day of Sri Venkateswara Vaibhavotsavams held at NTR Stadium in Hyderabad on Saturday evening, the Chairman complimenting the donors for making elaborate arrangements for the sake of devotees in the venue for the five day religious fete, he said, post-covid, TTD has so far successfully conducted Sri Venkteswara Vaibhavotsavams in Nellore and now in Hyderabad and in December, the celestial fete will be organised at Ongole. “While Srinivasa Kalyanams, we have already conducted the divine wedding in a big way at Chennai and also at United States of America. From October 18 to November 17, the celestial kalyanams will be performed at different states of UK”, he maintained.

The TTD Board Chief also said, as a part of its noble mission of taking forward Hindu Sanatana Dharma, TTD has so far constructed 570 temples in backward areas and action plan is underway to construct 2000 temples in twin Telugu States with the support of donors. 

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులకు శ్రీవారి ఆశీస్సులు : టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డి

హైదరాబాద్, 2022 అక్టోబరు 15: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్.జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులకు శ్రీవారి ఆశీస్సులు అందించేందుకు దేశవ్యాప్తంగా శ్రీ నివాస కల్యాణాలు, శ్రీ వేంకటేశ్వర వైభవోత్సవాలు నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందించామని టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డి తెలిపారు.

హైదరాబాద్ లోని ఎన్టీఆర్ స్టేడియంలో ఐదు రోజుల పాటు జరిగిన వైభవోత్సవాల ముగింపు సందర్భంగా శనివారం రాత్రి జరిగిన శ్రీనివాస కళ్యాణంలో టిటిడి చైర్మన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ ఈ నెల 11 నుంచి హైదరాబాద్ లో ఘనంగా శ్రీ వెంకటేశ్వర వైభవోత్సవాలు జరిగాయన్నారు. ఈ ఉత్సవాల నిర్వహణకు ముందుకొచ్చిన దాతలు శ్రీ హర్షవర్ధన్‌, శ్రీ ఎస్‌ఎస్‌.రెడ్డి, శ్రీ వెంకటేశ్వర్‌రెడ్డి, శ్రీ సుబ్బారెడ్డి కుటుంబాలకు శ్రీవారి ఆశీస్సులు మెండుగా ఉండాలని ఆకాంక్షించారు. పాల్గొన్న భక్తులందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఈ సందర్భంగా స్వామివారిని వేడుకుంటున్నానని చెప్పారు.

దేశవ్యాప్తంగా శ్రీవారి ఆలయాల నిర్మాణం జరుగుతోందని, శిథిలావస్థకు చేరుకున్న ఆలయాల పునర్నిర్మాణం చేపడుతున్నామని వివరించారు. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకు వెనకబడిన, గిరిజన ప్రాంతాల్లో 570 ఆలయాల నిర్మాణం చేపట్టామన్నారు. తెలుగు రాష్ట్రాల్లో రానున్న కాలంలో 2 వేల ఆలయాల నిర్మాణానికి కార్యాచరణ రూపొందించామని వెల్లడించారు. దాతల సహకారంతో ప్రతి జిల్లాలోనూ వైభవోత్సవాలు నిర్వహించేందుకు చర్యలు చేపడతామన్నారు. ఈ ఏడాది ఆగస్టు నెలలో నెల్లూరులో ఘనంగా వైభవోత్సవాలు నిర్వహించామన్నారు. త్వరలో ఒంగోలులో ఉత్సవాలను నిర్వహిస్తామని తెలియజేశారు.

జూలై, ఆగస్టు నెలల్లో అమెరికాలోని తొమ్మిది రాష్ట్రాల్లో శ్రీనివాస కళ్యాణాలు నిర్వహించామని, శ్రీవారి భక్తుల నుండి విశేష స్పందన లభించిందని తెలిపారు. ఈ నెల 18 నుంచి నవంబర్ 17వ తేదీ వరకు యూరప్ దేశంలోని తొమ్మిది రాష్ట్రాల్లో శ్రీవారి కళ్యాణాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.