TTD GEARS UP FOR VAIKUNTHA EKADASI AND NEW YEAR IN LOCAL TEMPLES_ వైకుంఠ ఏకాదశికి టిటిడి స్థానిక ఆలయాలు ముస్తాబు
Tirupati, 21 Dec. 17: Glittering lights, flower and mango leaves decorations and rangolis mark the preparations by the TTD for the holy event of Vaikunta Ekadasi, Dwadasi and New Year celebrations in all local temples on December 29, 30 and January 1.
At Sri Padmavati Ammavari Temple of Tiruchanoor special rituals will be performed on Ekadasi and Dwadasi and on second day tirumanjanam to Sri Sudarshana Chakrathalwar will be conducted.
At Srinivasa Mangapuram temple of Sri Kalyana Venkateswara Swamy special Tiruppavai, Abhisekham rituals performed on Friday, December 29th and sarva darshan willcommence from 5am to 9pm in the night. Similarly on Dec 30 Sri Sudarshana Chakrathalwar will be paraded on mada streets and chakrasnanam is performed in the Pushkarini. All Kalyanotsavams and arjita sevas on Dec 29 and 30 are cancelled.
At the Sri Venkateswara Swamy temple of Appalayagunta after special Tiruppavai, Abhisekham and thiru veedhi utsavam rituals, sarva darshanam will commence from 6.30am. Similarly on December 30 on Dwadasi, Snapana thirumanjanam and chakrasnanam are performed in the Pushkarini in the evening.
At the Nagalapuram Sri Veda Narayana Swamy temple Tiruppavai, Koluvu, Abhisekham Thomala seva Panchanga sravanam and Dhanumasa rituals, Tiruveedhi utsavam will be performed on Dec 29 and darshan for devotees will commence from 5.00am till 8.00pm.
Similarly at Sri Govindaraja swamy temple, Sri Kodandarama swamy temple Tirupati, Sri Kodandaramalayam Chandragiri, Sri Kalyana Venkateswara swamy temple, Narayanavam, Sri Venugopala swamy temple, Karvetinagaram, Sri Padmavathi and Sri Venkateswara swamy temple Pithapuram, Sri Koneti Narayanaswami temple Kilapatla and Sri Venkateswara temple, Bangalore special arrangements have been made for Vaikunta Ekadasi and Dwadasi celebrations and darshan for devotees.
ISSUED BY PUBLIC RELATIONS OFFICERS, TTD,TIRUPATI
వైకుంఠ ఏకాదశికి టిటిడి స్థానిక ఆలయాలు ముస్తాబు
తిరుపతి, 2017 డిసెంబరు 21: డిసెంబరు 29వ తేదీన వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని టిటిడి స్థానిక ఆలయాలలో భక్తుల సౌకర్యార్థం విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు. అన్ని ఆలయాల్లో ప్రత్యేక క్యూలైన్లు, చలువ పందిళ్లు, రంగవల్లులు తీర్చిదిద్ది వివిధ రకాల పుష్పాలతో అందంగా అలంకరించనున్నారు.
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఏకాదశి నాడు అమ్మవారికి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. డిసెంబరు 30వ తేదీ ద్వాదశి నాడు ఉదయం 7.00 నుండి 9.00 గంటల వరకు శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్‌కు తిరుమంజనం, చక్రస్నానం జరుగనుంది.
శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో డిసెంబరు 29న వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం వేకువజామున 12.05 గంటల నుండి 2.30 గంటల వరకు తిరుపల్లచ్చితో శ్రీవారిని మేల్కొలిపి, ధనుర్మాస కైంకర్యాలు నిర్వహిస్తారు. 2.30 నుండి 3.30 గంటల వరకు మూలవర్లకు అభిషేకం నిర్వహించనున్నారు. ఉదయం 5.00 నుండి రాత్రి 9.00 గంటల వరకు భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తారు. డిసెంబరు 30వ తేదీ ఉదయం 8.00 నుండి 9.30 గంటల వరకు శ్రీ సుదర్శన చక్రతాళ్వార్‌ను నాలుగు మాడ వీధులలో ఊరేగించి, పుష్కరిణిలో చక్రస్నానం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా డిసెంబరు 29, 30వ తేదీలలో ఆర్జిత కల్యాణోత్సవం సేవ రద్దు కానున్నాయి.
అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో డిసెంబరు 29న వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం వేకువజామున 2.30 నుండి 4.00 గంటల వరకు తిరుప్పావైతో స్వామివారిని మేల్కొలిపి, ధనుర్మాస కైంకర్యాలు నిర్వహిస్తారు. 4.00 నుండి 5.00 గంటల వరకు మూలవర్లకు అభిషేకం నిర్వహిస్తారు. ఉదయం 5.00 నుండి 6.00 గంటల వరకు తిరువీధి ఉత్సవం జరగనుంది. ఉదయం 6.30 నుండి రాత్రి 9.00 గంటల వరకు భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తారు. అనంతరం రాత్రి కైంకర్యాలు నిర్వహిస్తారు. డిసెంబరు 30న వైకుంఠ ద్వాదశి సందర్భంగా ఉదయం 8.00 గంటలకు స్వామి, అమ్మవార్ల ఊరేగింపు, 9.00 గంటలకు స్నపనతిరుమంజనం, ఉదయం 10.00 గంటలకు చక్రస్నానం నిర్వహించనున్నారు.
నాగలాపురంలోని శ్రీ వేద నారాయణస్వామివారి ఆలయంలో డిసెంబరు 29న వైకుంఠ ఏకాదశి పురస్కరించుకుని వేకువజామున 3.00 నుండి 4.30 గంటల వరకు తిరుపాల్లచ్చితో స్వామివారిని మేల్కొలిపి, తోమాల సేవ, కొలువు, పంచాంగ శ్రవణం, ధనుర్మాస కైంకర్యాలు నిర్వహిస్తారు. ఉదయం 5.00 నుండి రాత్రి 8.00 గంటల వరకు భక్తులకు సర్వదర్శనం కల్పిస్తారు. ఉదయం 9.30 గంటలకు ఉత్సవర్లకు అభిషేకం, సాయంత్రం 6.00 నుండి రాత్రి 8.00 గంటల వరకు తిరువీధి ఉత్సవం నిర్వహిస్తారు.
అదేవిధంగా తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం, శ్రీ కోదండరామాలయం, చంద్రగిరిలోని శ్రీ కోదండరామాలయం, నారాయణవనంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో, కార్వేటినగరంలోని శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయం, పిఠాపురంలోని శ్రీపద్మావతి సమేత వేంకటేశ్వరస్వామివారి ఆలయం, కీలపట్ల శ్రీ కోనేటిరాయస్వామివారి ఆలయం, బెంగుళూరులోని శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయాల్లో వైకుంఠ ఏకాదశికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.