VAIKUNTHA EKADASI ARRANGEMENTS INSPECTED BY AD.EO _ వైకుంఠ ఏకాదశి ప్రత్యేక క్యూలైన్లను పరిశీలించిన టిటిడి అదనపు ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి
Tirumala, 29 Dec. 19: The Additional EO Sri AV Dharma Reddy inspected arrangements in view of the upcoming major festival of Vaikuntha Ekadasi and Dwadasi on January 6 and 7 respectively.
He inspected the queue lines laid by the Engineering department at four mada streets, Narayanagiri Gardens, Seva Sadan Complexes, Kalyana Vedika and Outer Ring Road along with CVSO Sri Gopinath Jatti, Tirupati Urban SP Sri Gajarao Bhupal and made necessary instructions to the concerned.
TTD CE Sri Ramachandra Reddy, SE 2 Sri Nageswara Rao, SE Electrical Sri Venkateswarulu, EE Sri Subramanyam, VGO Sri Manohar, DSP Sri Prabhakar, AVSOs, CIs were also present.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
వైకుంఠ ఏకాదశి ప్రత్యేక క్యూలైన్లను పరిశీలించిన టిటిడి అదనపు ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి
డిసెంబరు 29, తిరుమల 2019: తిరుమల శ్రీవారి ఆలయంలో జనవరి 6 వైకుంఠ ఏకాదశి, 7న వైకుంఠ ద్వాదశి పర్వదినాల సందర్భంగా తిరుమలకు విశేషంగా భక్తులు విచ్చేసే అవకాశం ఉండడంతో టిటిడి విస్తృతంగా ఏర్పాట్లు చేపడుతోంది.
ఈ క్రమంలో టిటిడి అదనపు ఈవో శ్రీ ఏవి ధర్మారెడ్డి ఆదివారం సివిఎస్వో శ్రీ గోపీనాథ్ జెట్టి, తిరుపతి అర్బన్ ఎస్పీ శ్రీ గజరావు భూపాల్ తో కలిసి క్యూలైన్లను పరిశీలించారు. ఏటీసీ కార్ పార్కింగ్, నారాయణగిరి ఉద్యానవనాలు, కళ్యాణ వేదిక నుండి శ్రీవారి సేవా సదనం భవనాల వరకు ఏర్పాటుచేసిన ప్రత్యేక క్యూలైన్లను పరిశీలించి ఇంజినీరింగ్ అధికారులకు పలు సూచనలు చేశారు. క్యూలైన్లలోని భక్తులకు సౌకర్యవంతంగా అన్నప్రసాదాలు, తాగునీరు అందేలా చూడాలని, క్యూలైన్లకు అనుబంధంగా మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. భక్తుల భద్రత, ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా తీసుకోవాల్సిన చర్యలపై సివిఎస్వో, అర్బన్ ఎస్పీతో చర్చించారు.
అదనపు ఈఓ వెంట టిటిడి చీఫ్ ఇంజినీర్ శ్రీ రామచంద్రారెడ్డి, ఎస్ఇ-2 శ్రీ నాగేశ్వరరావు, విఎస్వోలు శ్రీ మనోహర్, శ్రీ ప్రభాకర్ తదితరులు ఉన్నారు.
తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.