VAIKUNTHA NARAYANA RIDES PEDDA SESHA VAHANAM _ పెద్దశేష వాహనంపై వైకుంఠ నారాయ‌ణుడి అలంకారంలో శ్రీ‌నివాసుడు

Tirupati, 2 March 2021: As part of the ongoing annual brahmotsavams at Srinivasa Mangapuram, Lord Sri Kalyana Venkateswara as Vaikuntha Narayana, accompanied by Sridevi and Bhudevi graced on Pedda Sesha Vahanam.

Decked in dazzling jewels and colourful attire, the deities seated majestically on the Seven hooded Pedda Sesha Vahanam, showered blessings.

In view of Covid guidelines, the vahana seva took place in Ekantam at Vahana Mandapam.

DyEO Smt Shanti, AEO Sri.Dhananjayulu, Superintendents Sri Ramanaiah, Sri Chengalrayulu were also present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

పెద్దశేష వాహనంపై వైకుంఠ నారాయ‌ణుడి అలంకారంలో శ్రీ‌నివాసుడు

తిరుపతి, 2021 మార్చి 02: శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో మొదటిరోజు మంగళవారం రాత్రి 7 నుండి 8 గంటల వరకు పెద్దశేష వాహనంపై శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారు వైకుంఠ నారాయణుడి అలంకారంలో దర్శనమిచ్చారు. కోవిడ్ -19 నేప‌థ్యంలో వాహనసేవ ఆల‌యంలో ఏకాంతంగా జరిగింది..

ఏడుపడగలు గల ఆదిశేషుడు ఏడుకొండలకు, ఏడు లోకాలకు సంకేతం. శేషుడు శ్రీనివాసునికి తిరుమలలో నివాసభూమి అయినా శ్రీనివాసమంగాపురంలో వాహనరూపంలో శ్రీవారిని స్తుతిస్తూ, స్వామికి మంచం, పరుపు, ఛత్రం మూడూ తానే అయి శేషశాయి అనే పేరును సార్థకం చేస్తున్నారు. శ్రీవారి విశ్రాంతికీ, సుఖనిద్రకూ కారణమవుతున్నాడు.

ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి శాంతి, ఏఈవో శ్రీ ధ‌నంజ‌యులు, సూపరింటెండెంట్లు శ్రీ ర‌మ‌ణ‌య్య‌, శ్రీ చెంగ‌ల్రాయులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.