VAIKUNTHADWARA SSD TOKENS QUOTA COMPLETED _ భక్తులకు విజ్ఞప్తి
NEXT SSD TOKENS ISSUANCE ON JAN 2 ONLY
Tirumala,25 December 2023: The issue of Slotted Sarva Darshan(SSD) tokens from December 23- January 1 for Vaikuntadwara Darshan of Tirumala Sri Venkateswara Swamy has been completely issued to devotees on Monday.
Over four lakh SSD tokens were issued at 90 counters in ten locations of Tirupati. The issuance of SSD tokens will be from January 2 only for the same day darshan.
Devotees are appealed to note that without tokens they are not entitled for Srivari Darshan.
భక్తులకు విజ్ఞప్తి
తిరుమల, 2023 డిసెంబరు 25: డిసెంబర్ 23 నుండి 2024 జనవరి 1వ తేదీ వరకు తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించిన సర్వ దర్శన టోకెన్లను జారీ సోమవారం ఉదయం 4.27 గంటలకు పూర్తి చేయడమైనది.
తిరుపతిలోని విష్ణునివాసం, శ్రీనివాసం, గోవిందరాజస్వామి సత్రాలు, భూదేవి కాంప్లెక్స్, రామచంద్ర పుష్కరిణి, ఇందిరా మైదానం, జీవకోన హైస్కూల్, బైరాగిపట్టెడలోని రామానాయుడు హైస్కూల్, ఎంఆర్ పల్లిలోని జడ్‌పి హైస్కూల్‌లో 90 కౌంటర్లలో 10 రోజులకు గాను 4 లక్షలకుపైగా సర్వదర్శనం టైంస్లాట్ టోకెన్లను సోమవారం ఉదయానికి జారీ చేయడం పూర్తయింది. తదుపరి సర్వదర్శనం టోకెన్లను జనవరి 2వ తేదీ నుండి ఇవ్వటం జరుగుతుంది.
టోకెన్లు లేని భక్తులను దర్శనానికి అనుమతించరు. భక్తులు ఈ విషయాన్ని గమనించి టీటీడీకి సహకరించగలరు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.