TEPPOTSAVAMS HELD _ తెప్పలపై శ్రీ కామాక్షి అమ్మ‌వారు ద‌ర్శ‌నం

TIRUPATI, 25 DECEMBER 2023: On the fourth day of ongoing annual Teppotsavams at Sri Kapileswara Swamy temple, Sri Kamakshi, Sri Lakshmi and Sri Saraswati Ammavarlu took out a celestial ride on the sacred waters to bless devotees.

 

The devotees were mesmerized to see the charm of Tridevi on the finely decked float which took seven rounds.

 

DyEO Sri Devendra Babu, AEO Sri Subbaraju, Superintendent Sri Bhupati and others were present.

 

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

తెప్పలపై శ్రీ కామాక్షి అమ్మ‌వారు ద‌ర్శ‌నం
 
తిరుపతి, 2023, డిసెంబరు 25: తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామి తెప్పోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు సోమ‌వారం రాత్రి శ్రీ కామాక్షి అమ్మ‌వారు ద‌ర్శ‌న‌మిచ్చారు.
 
సాయంత్రం 6.30 నుండి రాత్రి 8 గంటల వరకు తెప్పోత్సవం కన్నులపండుగగా జరిగింది. విద్యుద్దీపాలతో అందంగా అలంకరించిన తెప్పపై ఆశీనులైన శ్రీ కామాక్షి, ల‌క్ష్మీ, స‌ర‌స్వ‌తి అమ్మ‌వారు కపిలతీర్థం పుష్కరిణిలో ఏడు చుట్లు తిరిగారు. పెద్ద ఎత్తున హాజరైన భక్తులు స్వామివారికి కర్పూర నీరాజనాలు అందించారు. ఈ సందర్భంగా టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు భక్తి సంకీర్తనలు ఆలపించారు.
 
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ దేవేంద్ర బాబు, ఏఈవో శ్రీ సుబ్బరాజు, సూపరింటెండెంట్ శ్రీ భూపతి, టెంపుల్ ఇన్స్పెక్టర్లు శ్రీ రవికుమార్, శ్రీ బాలకృష్ణ, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
 
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.