VAIKUNTHANADHA ON PEDDASESHA VAHANA BLESS DEVOTEES _ పెద్ద‌శేష వాహనంపై వైకుంఠనాథుని అలంకారంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప అభయం

Tirumala, 18 September 2023: Thousands of devotees witnessed the procession of Sri Vaikunthanadha on Pedda Sesha Vahanam organized on the first day of the on-going nine-day annual Brahmotsavams of Sri Venkateswara Swamy in Tirumala on Monday Evening.

Sri Malayappa flanked by His two consorts Sri Devi and Bhu Devi took out a celestial ride on the mighty seven-hooded serpent, Adisesha.

The celestial entourage of Malayappaswami is comprised of decorated bulls, horses and elephants besides band of artists performing kolatas, bhajans and other interesting Bhakti feats to entertain the devotees.

TTD Chairman Sri Bhumana Karunakar Reddy, EO Sri AV Dharma Reddy, TTD board members etc. were present.

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI  

పెద్ద‌శేష వాహనంపై వైకుంఠనాథుని అలంకారంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప అభయం

తిరుమల, 2023 సెప్టెంబరు 18: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా మొదటిరోజైన సోమవారం రాత్రి శ్రీదేవి భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారు ఏడుతలల స్వర్ణశేషవాహనంపై(పెద్ద శేషవాహనం) వైకుంఠనాథుని అలంకారంలో తిరుమాడ వీధులలో భక్తులను అనుగ్రహించారు.

ఆదిశేషుడు తన పడగ నీడలో స్వామివారిని సేవిస్తూ పాన్పుగా దాస్యభక్తిని చాటుతున్నాడు. ఆదిశేషుడు శ్రీహరికి మిక్కిలి సన్నిహితుడు. రామావతారంలో లక్ష్మణుడుగా, ద్వాపరంలో బలరాముడుగా శ్రీమన్నారాయణుడికి మిక్కిలి సన్నిహితంగా ఉన్నవాడు శేషుడు. ఈయన శ్రీభూదేవి సహితుడైన శ్రీవేంకటేశ్వరుని వహిస్తూ తొలిరోజు భక్తులకు దర్శనమిచ్చారు. మంగళవారం ఉదయం చిన్నశేష వాహనం, రాత్రి హంస వాహనాలపై స్వామివారు కనువిందు చేయనున్నారు.

ఈ కార్యక్రమంలో టీటీడీ ఛైర్మన్ శ్రీ భూమ‌న క‌రుణాక‌ర‌రెడ్డి, ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి, పలువురు బోర్డు సభ్యులు, జెఈవోలు శ్రీమతి సదా భార్గవి, శ్రీ వీర‌బ్ర‌హ్మం, సివిఎస్వో శ్రీ న‌ర‌సింహ‌కిషోర్ తదితరులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.