VAISAKHA POURNAMI GARUDA SEVA ON APRIL 29_ఏప్రిల్‌ 29న వైశాఖ పౌర్ణమి గరుడసేవ

PILGRIMS TO WITNESS FIRST POURNAMI GARUDA SEVA OF THE YEAR

Tirumala, 9 April 2018: As the auspicious Vaisakha Pournami or Chitra Pournami is occurring on April 29, the pilgrims will witness the Pournami Garuda Seva on the same day evening between 7pm and 9pm.

Interestingly, this happens to be the first Pournami Garuda Seva in the year 2018. While the Pournami Garuda Seva was cancelled in the earlier months owing to special occasions in Tirumala temple viz. Adhyayanotsavams on January 2, Lunar Eclipse on January 31, Teppotsavams on March 2 and Vasanthotsavams on March 31.

Meanwhile the pilgrims will get an opportunity to witness Pournami Garuda Seva on May 29, June 28, August 26, September 25 and October 24 during this year.

The Pournami Garuda Seva is also cancelled on July 27 following Lunar Eclipse, November 22 on Karthika Deepotsavam and December 22 due to Adhyayanotsavams during this year.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

ఏప్రిల్‌ 29న వైశాఖ పౌర్ణమి గరుడసేవ

ఈ ఏడాదిలో ఇదే తొలిసారి

ఏప్రిల్‌ 09, తిరుమల 2018: తిరుమలలో ఏప్రిల్‌ 29వ తేదీన వైశాఖమాస పౌర్ణమి గరుడసేవ జరుగనుంది. ఈ సంవత్సరంలో మొదటిసారిగా పౌర్ణమి గరుడసేవ జరుగనుండడం విశేషం. దీనినే చిత్రా పౌర్ణమిగానూ వ్యవహరిస్తారు. తమిళ భక్తులు విశేషంగా విచ్చేసి స్వామివారిని దర్శించుకుంటారు. ఈ సందర్భంగా రాత్రి 7 నుంచి 9 గంటల వరకు సర్వాలంకార భూషితుడైన శ్రీ మలయప్పస్వామివారు గరుడ వాహనంపై భక్తులకు దర్శనమిస్తారు.

కాగా, ఈ సంవత్సరంలో జనవరి 2న శ్రీవారి ఆలయంలో అధ్యయనోత్సవాలు, జనవరి 31న చంద్రగ్రహణం, మార్చి 2న తెప్పోత్సవాలు, 31న వసంతోత్సవం కారణంగా పౌర్ణమి గరుడసేవ రద్దయిన విషయం తెలిసిందే.

అదేవిధంగా మే 29న, జూన్‌ 28న, ఆగస్టు 26న, సెప్టెంబరు 25న, అక్టోబరు 24వ తేదీన పౌర్ణమి గరుడసేవ నిర్వహిస్తారు.

రద్దయిన నెలలు :

జులై 27న చంద్రగ్రహణం, నవంబరు 22న కార్తీకపర్వదీపోత్సవం, డిసెంబరు 22న అధ్యయనోత్సవం కారణంగా పౌర్ణమి గరుడసేవను టిటిడి రద్దు చేసింది.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.