మార్చి 22న వాల్మీకిపురంలోని శ్రీ పట్టాభిరామస్వామివారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

మార్చి 22న వాల్మీకిపురంలోని శ్రీ పట్టాభిరామస్వామివారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

మార్చి 20, తిరుపతి, 2018: టిటిడికి అనుబంధంగా ఉన్న వాల్మీకిపురంలోని శ్రీ పట్టాభిరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలకు మార్చి 22వ తేదీ గురువారం అంకురార్పణ జరుగనుంది. ఆలయంలో మార్చి 23 నుంచి 31వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. ఈ ఉత్సవాల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు వేగవంతంగా జరుగుతున్నాయి. మార్చి 23న శుక్రవారం ఉదయం 8.15 నుండి 9.05 గంటల మధ్య మేష లగ్నంలో ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభంకానున్నాయి.

వాహనసేవల వివరాలు :

తేదీ ఉదయం సాయంత్రం

23-03-2018(శుక్రవారం) ధ్వజారోహణం గజ వాహనం

24-03-2018(శనివారం) ముత్యపుపందిరి వాహనం హనుమంత వాహనం
25-03-2018(ఆదివారం) కల్పవృక్ష వాహనం సింహ వాహనం

26-03-2018(సోమవారం) సర్వభూపాల వాహనం పెద్దశేష వాహనం

27-03-2018(మంగళవారం) సూర్యప్రభ వాహనం చంద్రప్రభ వాహనం
28-03-2018(బుధవారం) తిరుచ్చి ఉత్సవం కల్యాణోత్సవం, గరుడసేవ

29-03-2018(గురువారం) రథోత్సవం ధూళి ఉత్సవం

30-03-2018(శుక్రవారం) తిరుచ్చి ఉత్సవం అశ్వవాహనం, పార్వేటఉత్సవం

31-03-2018(శనివారం) వసంతోత్సవం/చక్రస్నానం హంస వాహనం, ధ్వజావరోహణం.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.