THIRD PHASE RING ROAD WORKS SHOULD COMPLETE BEFORE BTUS-TIRUMALA JEO_ శ్రీవారి బ్రహ్మూత్సవాలలోపు మూడవ విడత రింగ్‌రోడ్డు పనులు పూర్తి చేయాలి – తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు

Tirumala, 20 March 2018: The Third Phase of Ring Road works should complete before Srivari Brahmotsavams, said Tirumala JEO Sri KS Sreenivasa Raju.

During the weekly review meeting with HoDs of Tirumala at Annamaiah Bhavan on Tuesday, the JEO directed the Engineering Officials to complete the Third Phase Ring Road works on time and get it ready for Brahmotsavams.

He also reviewed on the progress of works with respect to Sarva Darshan counters at Tirumala and Tirupati with concerned SEs and EEs, IT department. Later he reviewed on construction of BT road at Kakulakonda and the ongoing civil works in first ghat road.

CE Sri Chandrasekhar Reddy, Additional CVSO Sri Sivakumar Reddy and other HoDs were also present.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

శ్రీవారి బ్రహ్మూత్సవాలలోపు మూడవ విడత రింగ్‌రోడ్డు పనులు పూర్తి చేయాలి – తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు

మార్చి 20, తిరుమల 2018: కలియుగ వైకుంఠమైన తిరుమలలో ఈ ఏడాది శ్రీవారి బ్రహ్మూత్సవాలలోపు 3వ విడత రింగ్‌రోడ్డు పనులు పూర్తి చేయాలని టిటిడి తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌ శ్రీనివాసరాజు అధికారులను ఆదేశించారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో మంగళవారం తిరుమలలో జరుగుతున్న అభివృద్ధి పనులపై అధికారులతో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ తిరుమల, తిరుపతిలో నిర్మాణంలో ఉన్న సమయ నిర్దేశిత సర్వదర్శనం కౌంటర్ల పనులపై ఇంజినీరింగ్‌, ఎలక్ట్రికల్‌, ఐటి అధికారులతో సమీక్షించారు. తిరుమలలోని ముఖ్యమైన ప్రాంతాలలో ఉన్న రోడ్లను అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు రూపొందిచాలని ఇంజినీరింగ్‌ అధికారులకు సూచించారు. అదేవిధంగా ధర్మగిరి మార్గం, కాకులకొండ వద్ద క్రొత్త బి.టి. రోడ్లు నిర్మించనున్నట్లు తెలిపారు.

శ్రీవారి ఆలయం వెలుపల నిర్మాణంలో ఉన్న ఉగ్రాణం నిర్మాణ పనులపై అధికారులతో సమీక్షించారు. శ్రీవారి లడ్డూ నాణ్యత పెంచేందుకు ఎఫ్‌ఏ అండ్‌ సిఎవో శ్రీబాలాజీ, శ్రీవారి ఆలయం డెప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాధ్‌, జియం ట్రాన్స్‌పోర్టు శ్రీ శేషారెడ్డి, ఆరోగ్య విభాగం అదికారి డా|| శర్మిష్ఠ ఆధ్వార్యంలో ఏర్పాటు చేసిన కమిటీి నివేదికను పరిశీలించి పలు సూచనలు చేశారు. ఈ కమిటీ మలి విడత సమీక్షను మార్చి 28వ తేదీ నిర్వహించనున్నట్లు తెలిపారు. తిరుమలలోని ఎస్‌.వి.మ్యూజియంలో శేషాచలం జీవవైవిధ్యం (బయోడైవర్శిటి) గ్యాలరీ ఏర్పాటుపై జెఈవో మ్యూజియం అధికారి డా|| పి.వి.రంగనాయకులకు పలు సూచనలు చేశారు.

అనంతరం జెఈవో మీడియాతో మాట్లాడుతూ భక్తులకు మరింత విస్తృతంగా సేవలందించేందుకు ఎప్పటికప్పుడు మార్పులు తీసుకువస్తున్నట్లు తెలిపారు. భక్తులకు విశేషమైన సేవలందించే శ్రీవారి సేవకులు బృందాలుగానే కాకుండా 7, 4 మరియు 3 రోజుల సేవలలోను, ప్రత్యేక పర్వదినాలలో రెండు రోజుల సేవకు వ్యక్తిగతంగా నమోదు చేసుకునేందుకు మార్చి 21వ తేదీ నుండి అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. తద్వారా సేవకులు వ్యక్తిగతంగా వచ్చి భక్తులకు విశేష సేవలందించే అవకాశం కలుగుతుందన్నారు. రాబోవు రోజులలో శ్రీవారిసేవకులకు తాము సేవ చేసే ప్రాంతాలను కూడా ముందస్తుగా సూచించడం జరుగుతుందని తెలిపారు. తిరుమలలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులపై విభాగాల వారిగా అధికారులతో సమీక్షించినట్లు తెలియచేశారు.

ఈ కార్యక్రమంలో సిఇ శ్రీ చంద్రశేఖర్‌రెడ్డి, అదనపు సివిఎస్వో శ్రీ శివకుమార్‌రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.