VANA BHOJANAM AT PAPAVINASANA THEERTHAM_ పాపవినాశనం తీర్థంలో వేడుకగా వనభోజనం
Tirumala, 23 April 2018: Tirumala JEO Sri KS Sreenivasa Raju today said the unique festival of annual Teppotsavam of Srivari Temple was a major feat by the TTD.
Participating in a Vanabhojanam organized as part of the Thanksgiving to the TTD staff at the Papavinasam theertham, the JEO said the Engineering, Electrical and the Garden departments, which has struggled day and night to make the Teppotsavam as a grand success.
He said the five-day long Teppotsavam in which Sri Malayappaswamy along with His consorts Sri Devi and Bhudevi had taken the ride on a colorfully decorated with bright flowers and glittering lights was a spectacular festival held at Tirumala.
He said TTD staff was committed for creating a devotee friendly environment and for the prompt conduct of rituals as per agama traditions at Tirumala and Tirupati and thereby enhancing the spiritual and devotional environment at the world-famous shrine of Lord Venkateswara.
SE Sri Ramachandra Reddy, DyEOs Sri Venugopal, Sri Balaji, Smt Nagarathna, VGO Sri Raveendra Reddy and others took part.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATHI
పాపవినాశనం తీర్థంలో వేడుకగా వనభోజనం
ఏప్రిల్ 23, తిరుమల 2018: తిరుమలలోని పాపవినాశనం తీర్థం(పాత పాపవినాశనం)లో సోమవారం వేడుకగా వనభోజన కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన టిటిడి తిరుమల జెఈవో శ్రీకె.ఎస్.శ్రీనివాసరాజు మీడియాతో మాట్లాడుతూ 60 వేల తీర్థాలు కలిసే ప్రదేశంగా పుష్కరిణికి ప్రాశస్త్యం ఉందని, ఇందులో ఫిబ్రవరి 25 నుండి మార్చి 1వ తేదీ వరకు తెప్పోత్సవాలను వైభవంగా నిర్వహించామని తెలిపారు. శ్రీవారి ఆలయంతోపాటు సివిల్, ఎలక్ట్రికల్, వాటర్‌వర్క్స్, నిఘా, భద్రతా అధికారులు, సిబ్బంది తెప్పోత్సవాల విజయవంతానికి కృషి చేసినట్టు వివరించారు. తెప్పోత్సవాలు విజయవంతమైనందుకు గాను కిందిస్థాయి సిబ్బందితో వనభోజనం నిర్వహించామన్నారు.
ముందుగా పాపవినాశనం తీర్థంలో గల శ్రీ గంగమ్మకు, శ్రీ ఆంజనేయస్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తరువాత పసుపు, కుంకుమ, ఫలాలను నీటి ప్రవాహంలో కలిపారు.
ఈ కార్యక్రమంలో టిటిడి ఎస్‌ఇ-2 శ్రీ రామచంద్రారెడ్డి, ఎస్‌ఇ(ఎలక్ట్రికల్స్) శ్రీ వేంకటేశ్వర్లు, డిఎఫ్‌వో శ్రీ డి.ఫణికుమార్‌నాయుడు, వాటర్‌వర్క్స్ ఇఇ శ్రీ శ్రీనివాసరావు, విజివో శ్రీ రవీంద్రారెడ్డి, అన్నదానం ప్రత్యేకాధికారి శ్రీ వేణుగోపాల్, డెప్యూటీ ఈవోలు శ్రీ బాలాజి, శ్రీమతి నాగరత్న ఇతర అధికారులు పాల్గొన్నారు.
తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.