ALL SET FOR SRI PADMAVATHI PARNIYANOTSAVAM_ తిరుమలలో శ్రీ పద్మావతి పరిణయోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి

Tirumala, 23 April 2018: TTD has made all arrangements for the three day celestial event of Sri Padmavati Parinayam being held at the Narayanagiri gardens from April 24 onwards.

The Narayanagiri gardens are decked up with floral designs and models of gods and goddesses with bright lights and colorful decorations with crystal balls, crystal chandeliers. The unjal mandapams is feast for eyes with all fruits decos- pineapple, papaya, corn, grapes, apples and orange. The parinaya mandapam is decked with flowers from Chennai, Bangalore etc.

On Day 1 of the festival the utsava deity of Sri Malayappaswamy will ride on Gaja Vahanam and on Aswa Vahanam and Garuda Vahanams on days. The consorts Sri Bhudevl and Bhu Devi will arrive at the mandapams in special palanquins intime for the kalyanotsavams.

According to Venkatachala Mahatyam Lord Venkateswara aka Maha Vishnu came to earth in around 5000 years ago and got wedded to Padmavati daughter of King Akasha at the Narayanavanam on vaishaka suddha dashami. That event is replicated by TTD every year since 1992 as a three day Padmavati Parinayam concluding on Thursday at the same Narayanagiri gardens.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATHI

తిరుమలలో శ్రీ పద్మావతి పరిణయోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి

ఏప్రిల్‌ 23, తిరుమల 2018: తిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనాల్లో ఏప్రిల్‌ 24వ తేదీ మంగళవారం నుండి మూడు రోజుల పాటు జరుగనున్న శ్రీ పద్మావతి శ్రీనివాసుల పరిణయోత్సవాలకు టిటిడి ఏర్పాట్లు పూర్తి చేసింది.

టిటిడి ఉద్యానవన విభాగం ఆధ్వర్యంలో పరిణయోత్సవ మండపాన్ని సర్వాంగసుందరంగా తీర్చిదిద్దారు. అష్టలక్ష్ములు, చిన్నికృష్ణుడు, వెన్నకృష్ణుడు తదితర దేవతామూర్తుల ఆకృతులను ఏర్పాటుచేశారు. మధ్యమధ్యలో క్రిస్టల్‌ బాల్స్‌, క్రిస్టల్‌ పిల్లర్స్‌, షాండ్లియర్లు ఉన్నాయి. ఊంజల మండపాన్ని చెరకు గడలు, ఆపిల్‌, నారింజ, ద్రాక్ష, మొక్కజొన్న కంకులు, అనాస పండ్లు, రంరంగుల పుష్పాలతో అత్యద్భుతంగా తీర్చిదిద్దారు. కాగా ఈ మండపం అలంకరణకు పుణేకి చెందిన శ్రీ వేంకటేశ్వర చారిటబుల్‌ ట్రస్టు వారు టిటిడికి విరాళం అందించారు. పరిణయ మండపాన్ని విద్యుత్తుదీపాలతో మనోహరంగా అలంకరించారు. చెన్నై, బెంగళూరు నగరాలకు చెందిన అలంకార నిపుణులు ఈ మండపాన్ని అలంకరిస్తున్నారని టిటిడి ఉద్యానవన సూపరింటెండెంట్‌ శ్రీ శ్రీనివాసులు తెలిపారు.

మూడురోజులపాటు జరుగనున్న ఈ వేడుకలో తొలిరోజు శ్రీ మలయప్పస్వామివారు గజవాహనంపై, రెండవరోజు అశ్వవాహనంపై, చివరిరోజు గరుడవాహనంపై వేంచేపు చేస్తారు. మరోపక్కఉభయనాంచారులు ప్రత్యేక పల్లకీలలో పరిణయోత్సవ మండపానికి వేంచేపు చేస్తారు. ఆ తరువాత కల్యాణమహోత్సవం కన్నులపండుగగా నిర్వహిస్తారు.

పౌరాణిక ప్రాశస్త్యం :

పురాణాల ప్రకారం సుమారు ఐదు వేల ఏళ్ల కిందట, అంటే కలియుగం తొలినాళ్లలో సాక్షాత్తు వైకుంఠం నుండి శ్రీమహావిష్ణువు శ్రీ వేంకటేశ్వరునిగా భూలోకానికి తరలివచ్చారు. ఆ సమయంలో నారాయణవనాన్ని పరిపాలిస్తున్న ఆకాశరాజు తన కుమార్తె అయిన శ్రీ పద్మావతిని శ్రీవేంకటేశ్వరునికిచ్చి వివాహం చేశారు. ఆకాశరాజు వైశాఖశుద్ధ దశమి శుక్రవారం పూర్వ ఫల్గుణి నక్షత్రంలో నారాయణవనంలో కన్యాదానం చేసినట్లుగా శ్రీ వేంకటాచల మహాత్మ్యం గ్రంథం తెలుపుతోంది. ఆనాటి పద్మావతీ శ్రీనివాసుల కల్యాణోత్సవ ముహూర్తానికి గుర్తుగా ప్రతి వైశాఖ శుద్ధ దశమినాటికి ముందు ఒక రోజు, తరువాత ఒక రోజు కలిపి మొత్తం మూడురోజుల పాటు పద్మావతీ పరిణయోత్సవాన్ని టిటిడి నిర్వహిస్తోంది. 1992వ సంవత్సరం నుంచి ఈ ఉత్సవం జరుగుతోంది. ఆనాటి నారాయణవనానికి ప్రతీకగా తిరుమల నారాయణగిరి ఉద్యానవనంలో శ్రీ పద్మావతీ పరిణయ వేడుకలు జరగడం విశేషం.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.