VARALAKSHMI VRATAM FOR THE WELFARE OF HUMANITY- TTD CHAIRMAN _ వరలక్ష్మీ వ్రతంతో లోకం సుభిక్షంగా ఉంటుంది : – టీటీడీ చైర్మన్ శ్రీ భూమన కరుణాకర రెడ్డి

Tirupati, 25 August 2023: The TTD Chairman Sri B Karunakara Reddy took part in Varalakshmi Vratam held at Tiruchanoor on Friday.

Later speaking to media he said the Vratam bestows prosperity on humanity.

He said the event was conducted in a successful manner with a clear action plan by all departments of TTD. ”Annaprasadam, water was distributed to devotees with a perfect queue system and devotees were provided with hassle-free darshan. It’s a lifetime divine opportunity for me to take part in this sacred Vratam”, he maintained.

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

వరలక్ష్మీ వ్రతంతో లోకం సుభిక్షంగా ఉంటుంది : – టీటీడీ చైర్మన్ శ్రీ భూమన కరుణాకర రెడ్డి

తిరుపతి, 2023 ఆగస్టు 25: వరలక్ష్మీ వ్రతం చేయడం వలన లోకం సుభిక్షంగా ఉంటుందని, అష్ట ఐశ్వర్యాలు, సుఖశాంతులను అమ్మవారు అనుగ్రహిస్తారని టీటీడీ చైర్మన్ శ్రీ భూమన కరుణాకర రెడ్డి అన్నారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ ఆస్థాన మండపంలో శుక్రవారం జరిగిన వరలక్ష్మీ వ్రతంలో చైర్మన్ శ్రీ భూమన కరుణాకర రెడ్డి దంపతులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా చైర్మన్ మీడియాతో మాట్లాడుతూ, శ్రీ మహాలక్ష్మీ అవతరించిన దివ్యస్థలం తిరుచానూరులో వరలక్ష్మీ వ్రతం ఆచరించడం ఆనవాయితీగా వస్తోందన్నారు.
ఆలయం వద్ద ఉన్న ఆస్థాన మండపంలో పాంచరాత్ర ఆగమం ప్రకారం అర్చకులు వరలక్ష్మీ వ్రతాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించినట్లు తెలిపారు.

భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేక క్యూలైన్లు, అన్నప్రసాదాలు ఇతర ఏర్పాట్లు చేశామన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.