VARALAKSHMI VRATAM IN TIRUCHANOOR ON AUGUST 9_ ఆగస్టు 9న తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వరలక్ష్మీ వ్రతం

Tirupati, 21 Jul. 19: One of the most important Hindu festivals especially for married women seeking the longeivity of their spouse, Varalakshmi Vratam will be observed with religious grandeur at Tiruchanoor on August 9.

The processional deity of Sri Padmavathi in all Her divine splendour will be seated on a specially created platform on that day at Asthana Mandapam and Varalakshmi Vratam will be observed between 10am and 12noon.

Later in the evening there will be procession of Swarna Ratham along the four mada streets in the evening at 6pm.

TTD has cancelled all arjitha seva and evening VIP break darshan on that auspicious day.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ఆగస్టు 9న తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వరలక్ష్మీ వ్రతం

తిరుపతి, 2019 జూలై 21: తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి పట్టపుదేవేరి అయిన తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఆగస్టు 9న శుక్రవారం ఉదయం 10 నుంచి 12 గంటల వరకు వరలక్ష్మీ వ్రతం జరుగనుంది.

శ్రీ అలిమేలుమంగ అవతరించిన దివ్యస్థలం తిరుచానూరు. తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి తపోదీక్షకు ప్రతిఫలంగా సాక్షాత్తు శ్రీమహాలక్ష్మీ తిరుచానూరులోని పద్మసరోవరంలో అవతరించింది. ప్రతి సంవత్సరం పవిత్రమైన శ్రావణమాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారంనాడు వరలక్ష్మీ వ్రతం నిర్వహిస్తారు. వరాలు ఇచ్చే దేవతగా వరలక్ష్మీ దేవిని కొలుస్తారు. వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తే అష్టలక్ష్మీ పూజలతో సమానంగా భక్తులు విశ్వసిస్తారు. స్కంద, భవిష్యోత్తర పురాణాల ప్రకారం పూర్వం శంకరుడు పార్వతిదేవికి ఈ వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించాల్సిన విధానాన్ని తెలియజేశాడు. ఈ ప్ర‌కారం ఉదయాన్నే మంగళస్నానం చేసి ఆలయంలో అర్చకులు ఏర్పాటుచేసిన మంటపంలో కొలువైన వరలక్ష్మీదేవిని దర్శించాలి. లక్ష్మీమాతను పాంచరాత్ర ఆగమశాస్త్ర ప్రకారం అర్చకులు ఆవాహనం చేసి షోడశోపచార పూజలు చేస్తారు.

స్వ‌ర్ణ‌ర‌థంపై సిరుల‌త‌ల్లి క‌టాక్షం

వ్రతం రోజున సాయంత్రం 6 గంటలకు శ్రీ పద్మావతి అమ్మవారు స్వర్ణరథంపై ఆలయ నాలుగు మాడవీధులలో భక్తులకు దర్శనమిస్తారు.

ఆర్జిత సేవ‌లు ర‌ద్దు

వరలక్ష్మీ వ్రతం కారణంగా ఆగ‌స్టు 9న‌ ఆలయంలో అభిషేకానంతర దర్శనం, లక్ష్మీపూజ, కల్యాణోత్సవం, కుంకుమార్చన, సహస్రదీపాలంకరణ సేవలతోపాటు ఉద‌యం, సాయంత్రం బ్రేక్ ద‌ర్శ‌నాల‌ను రద్దు చేయడమైనది. భక్తులు ఈ విష‌యాన్ని గ‌మ‌నించాల‌ని కోర‌డ‌మైన‌ది.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.