VARUNA YAGAM FOR GOOD RAINS-EO _ సమృద్ధిగా వర్షాల కోసమే వరుణ యాగం – టీటీడీ ఈవో శ్రీ ఎవి ధర్మారెడ్డి

TIRUPATI, 09 SEPTEMBER 2023: Seeking the divine intervention to bestow the state as well the country with good rains, TTD has mulled this Varuna Yagam said EO Sri AV Dharma Reddy.

After taking part in the Raksha Bandhanam and Gajapuja on the first day of Astottara Sata Kundatmaka Maha Shanti Varuna Yagam in Srinivasa Mangapuram temple on Saturday, speaking to the media the TTD EO said, the unique three-day Yagam aims at appeasing Rain God Varuna seeking for good amount of rainfall. “As weather experts stated that this year and next year there be meagre rains due to El Nino effect across the global atmosphere. So seeking the divine intervention we conducted Kareeristi Varunajapa Mahashanti Yagam at Dharmagiri in Tirumala from August 21-26 which yielded good results. Similarly we are conducting this Yagam at Sri Kalyana Venkateswara temple which will culminate with Gopuja and Maha Purnahuti on September 11. Over 200 Ritwiks from three different states are performing Yagam as per the tenets of Vaikhanasa Agama Sastra”, he maintained.

TTD JEO Sri Veerabrahmam, Spl Gr DyEO Smt Varalakshmi, AEO Sri Gopinath and others were present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

సమృద్ధిగా వర్షాల కోసమే వరుణ యాగం – టీటీడీ ఈవో శ్రీ ఎవి ధర్మారెడ్డి

తిరుపతి‌, 2023 సెప్టెంబ‌రు 09: సకలజన సౌభాగ్యాన్ని ఆకాంక్షిస్తూ, అందుకు అత్యంత అవసరమైన వరుణదేవుని అనుగ్రహం సమృద్ధిగా ఉండాలని అభిలషిస్తూ, సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురిసి దేశం, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని శ్రీవారిని ప్రార్థిస్తూ ప్రార్థిస్తూ టీటీడీ ఈ వరుణ యాగానికి శ్రీకారం చుట్టినట్లు ఈవో శ్రీ ఎవి ధర్మారెడ్డి తెలిపారు.

శనివారం శ్రీనివాసమంగాపురం ఆలయంలో అష్టోత్తర శత కుండాత్మక మహా శాంతి వరుణ యాగం తొలిరోజు రక్షాబంధనం, గజపూజలో పాల్గొన్న అనంతరం ఈవో మీడియాతో మాట్లాడుతూ, వాన దేవుడైన వరుణుడిని ప్రసన్నం చేసుకునేందుకు మూడు రోజులపాటు ఈ యాగం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎల్‌నినో ప్రభావంతో ప్రపంచ వాతావరణంలో ఈ ఏడాది, వచ్చే ఏడాది అతి తక్కువ వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు తెలిపారాన్నారు.

శ్రీవారి అనుగ్రహంతో తిరుమల ధర్మగిరిలో ఆగస్టు 21నుండి 26వ తేదీ వరకు కరీరిష్టి వరుణజప మహాశాంతి యాగం నిర్వహించినట్లు చెప్పారు. ఈ యాగం నిర్వహణ వల్ల తిరుమల, తిరుపతిలలో మంచి వర్షాలు పడుతున్నట్లు తెలిపారు.

సెప్టెంబర్ 11న గోపూజ, మహా పూర్ణాహుతితో ఈ యాగం ముగుస్తుందన్నారు. ఈ యాగంలో మూడు రాష్ట్రాలకు చెందిన 200 మందికి పైగా రుత్వికలు వైఖానస ఆగమ శాస్త్రం ప్రకారం యాగం నిర్వహిస్తున్నారని ఆయన తెలిపారు.

టీటీడీ జేఈవో శ్రీ వీరబ్రహ్మం, ప్రత్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మి, ఏఈవో శ్రీ గోపీనాథ్, తదితరులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.