VASANTHOTSAVAM IN TIRUCHANOOR OFF TO A COLOURFUL START_ తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వసంతోత్సవాలు ప్రారంభం

Tiruchanoor, 28 April 2018: The three-day annual Vasanthotsavam in the famous temple of Tiruchanoor commenced on a grand religious note on Saturday.

Every day after the morning rituals, there will be Snapana Tirumanjanam to processional deity of Goddess Padmavathi in Friday Gardens between 2:30pm and 4pm.

On Sunday there will be Swarnarathotsavam by 7:30am.

Spl Gr DyEO Sri Munirathnam Reddy, Temple officials present during this fete.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI


తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వసంతోత్సవాలు ప్రారంభం

ఏప్రిల్‌ 29న స్వర్ణరథోత్సవం

ఏప్రిల్‌ 28, తిరుపతి 2018: తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక వసంతోత్సవాలు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా ఆదివారం ఉదయం 7.30 గంటలకు స్వర్ణ రథోత్సవం జరుగనుంది.

వసంతోత్సవాల్లో భాగంగా ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చన నిర్వహించారు. మధ్యాహ్నం 2 గంటలకు అమ్మవారి ఉత్సవర్లను ఆలయం నుండి శుక్రవారపు తోటకు ఊరేగింపుగా తీసుకెళ్లారు. సాయంత్రం 3 నుండి 4.30 గంటల వరకు స్నపనతిరుమంజనం నిర్వహించారు. ఇందులోభాగంగా పసుపు, కుంకుమ, పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరినీళ్లతో అభిషేకం చేశారు. సాయంత్రం 6.30 నుండి 7.30 గంటల వరకు అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నారు. రాత్రి 7.30 నుండి 8.30 గంటల వరకు అమ్మవారిని ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగిస్తారు. గృహస్త భక్తులు ఒక్కొక్కరు రూ.150/- చెల్లించి ఒక రోజు వసంతోత్సవంలో పాల్గొనవచ్చు. ఈ సేవలో పాల్గొన్న భక్తులకు ఒక లడ్డూ, ఒక వడ బహుమానంగా అందజేస్తారు.

ఈ కార్యక్రమంలో ఆలయ ప్రత్యేక శ్రేణి ఉపకార్యనిర్వహణాధికారి శ్రీ మునిరత్నంరెడ్డి, సహాయ కార్యనిర్వహణాధికారి శ్రీ సుబ్రమణ్యం, ఆర్జితం ఇన్‌స్పెక్టర్‌ శ్రీ బి.గురవయ్య ఇతర అధికారులు, ఆలయ అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.