NEW TTD BOARD SWORN IN_ టిటిడి ధర్మకర్తల మండలి ఛైర్మన్‌గా శ్రీ పుట్టా సుధాకర్‌ యాదవ్‌ ప్రమాణస్వీకారం

Tirumala, 28 April 2018: The newly formed TTD Trust Board appointed by state government sworn in at the sanctum sanctorum of Lord Venkateswara in Tirumala on Saturday.

Among those who were administered oath includes the Chairman Sri Putta Sudhakar Yadav along with 12 other board members including Principal Secretary Endowments Sri Manmohan Singh and TTD EO Sri Anil Kumar Singhal as ex-officio members.

Speaking to media after darshan, Vedasirvachanam and receiving Teertha Prasadams of Lord Venkateswara, the Chairman and other members expressed their gratitude to the almighty and assured that the newly formed board will ensure hassle free darshan, accommodation and other facilities for pilgrims. “We discharge our duties with responsibility in co-ordination with TTD officials for the benefit of pilgrims”, the Chairman and members of TTD board asserted.

Later a formal introductory session took place at Annamaiah Bhavan with newly formed TTD board and other senior officers and HoDs of TTD.

JEOs Sri KS Sreenivasa Raju, Sri P Bhaskar, CE Sri Chandrasekhar Reddy, FACAO Sri O Balaji, Additional and In-charge CVSO Sri Siva Kumar Reddy, Sri Ashok Reddy who is the special invitee in TTD Trust board, other senior officers were also present.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

టిటిడి ధర్మకర్తల మండలి ఛైర్మన్‌గా శ్రీ పుట్టా సుధాకర్‌ యాదవ్‌ ప్రమాణస్వీకారం

ఏప్రిల్‌ 28, తిరుమల 2018: టిటిడి ధర్మకర్తల మండలి ఛైర్మన్‌గా శ్రీ పుట్టా సుధాకర్‌ యాదవ్‌, 12 మంది సభ్యులు శనివారం ప్రమాణస్వీకారం చేశారు. శ్రీవారి ఆలయంలోని గరుడాళ్వార్‌ సన్నిధిలో జరిగిన ఈ కార్యక్రమంలో టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ వీరిచేత ప్రమాణ స్వీకారం చేయించారు.

టిటిడి ధర్మకర్తల మండలి సభ్యులుగా శ్రీ జిఎస్‌ఎస్‌.శివాజి, శ్రీ బోండా ఉమామహేశ్వర్‌రావు, శ్రీబికె.పార్థసారధి, శ్రీ రాయపాటి సాంబశివరావు, శ్రీ చల్లా రామచంద్రారెడ్డి, శ్రీ పొట్లూరి రమేష్‌బాబు, శ్రీఇ.పెద్దిరెడ్డి, శ్రీ రుద్రరాజు పద్మరాజు, శ్రీ మేడా రామకృష్ణారెడ్డి, శ్రీడొక్కా జగన్నాథం, ఎక్స్‌అఫిషియో సభ్యులుగా రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి శ్రీమన్మోహన్‌సింగ్‌, సభ్య కార్యదర్శిగా టిటిడి కార్యనిర్వహణాధికారి శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ ప్రమాణ స్వీకారం చేశారు.

ప్రమాణ స్వీకారం అనంతరం ధర్మకర్తల మండలి ఛైర్మన్‌, సభ్యులు శ్రీవారిని దర్శించుకున్నారు. ఆ తరువాత శ్రీ వకుళామాత, శ్రీ విమాన వేంకటేశ్వరస్వామి, సబేరా, శ్రీభాష్యకార్ల సన్నిధి, శ్రీ యోగ నరసింహస్వామివారిని దర్శించుకుని హుండీలో కానుకలు చెల్లించారు. రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. టిటిడి తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు, తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌ కలిసి ధర్మకర్తల మండలి ఛైర్మన్‌, సభ్యులకు శ్రీవారి తీర్థప్రసాదాలు, చిత్రపటం అందించారు.

సామాన్య భక్తులకు మరింత మెరుగైన సేవలు అందిస్తాం : టిటిడి ధర్మకర్తల మండలి ఛైర్మన్‌ శ్రీ పుట్టా సుధాకర్‌ యాదవ్‌

తిరుమల శ్రీవారి దర్శనార్థం విచ్చేస్తున్న సామాన్య భక్తులకు మరింత మెరుగైన సేవలు అందిస్తామని టిటిడి ధర్మకర్తల మండలి ఛైర్మన్‌ శ్రీ పుట్టా సుధాకర్‌ యాదవ్‌ వెల్లడించారు.

తిరుమల శ్రీవారి ఆలయంలో శనివారం ప్రమాణస్వీకారం అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ టిటిడి ఛైర్మన్‌గా భక్తులకు సేవలందించే అవకాశం రావడం తన పూర్వజన్మ సుకృతమన్నారు. ఈ అవకాశం ఇచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌ|| శ్రీ నారా చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్టు చెప్పారు. తిరుమల పవిత్రతను, భక్తుల విశ్వాసాలను కాపాడతామన్నారు. ధర్మప్రచారం కోసం మరింత విస్తృతంగా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు శ్రీ యనమల రామకృష్ణుడు, శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు, శ్రీ ఆదినారాయణరెడ్డి, టిటిడి ఇన్‌చార్జి సివిఎస్‌వో శ్రీ శివకుమార్‌రెడ్డి, శ్రీవారి ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాథ్‌, డెప్యూటీ ఈవో శ్రీమతి గౌతమి ఇతర అధికారులు పాల్గొన్నారు.

టిటిడి ప్రతిష్టను మరింత పెంచుతాం :

పరిచయ సమావేశంలో టిటిడి ధర్మకర్తల మండలి ఛైర్మన్‌

గతంలో టిటిడి ధర్మకర్తల మండలి సభ్యునిగా పనిచేసిన అనుభవం ఉందని, ప్రస్తుత సభ్యులందరూ ఎంతో అనుభవమున్నవారని, అధికారులందరితో సమన్వయంతో పనిచేసి ధార్మికసంస్థ ప్రతిష్టను మరింత పెంచుతామని టిటిడి ధర్మకర్తల మండలి ఛైర్మన్‌ శ్రీ పుట్టా సుధాకర్‌యాదవ్‌ తెలిపారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో శనివారం ధర్మకర్తల మండలి పరిచయ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఛైర్మన్‌, సభ్యులు, టిటిడి అధికారులు పరిచయం చేసుకున్నారు.

ఈ సమావేశంలో టిటిడి ధర్మకర్తల మండలి ప్రత్యేక ఆహ్వానితులు శ్రీ అశోక్‌రెడ్డి, ఈవో శ్రీఅనిల్‌కుమార్‌ సింఘాల్‌, తిరుమల జెఈవో శ్రీకె.ఎస్‌.శ్రీనివాసరాజు, తిరుపతి జెఈవో శ్రీపోల భాస్కర్‌, ఎఫ్‌ఏ,సిఏవో శ్రీ ఓ.బాలాజి, చీఫ్ ఇంజినీర్ శ్రీ చంద్ర‌శేఖ‌ర్‌రెడ్డి, ఇన్‌చార్జి సివిఎస్‌వో శ్రీ శివకుమార్‌రెడ్డి, ఎస్‌ఇ-2 శ్రీరామచంద్రారెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.