వైభవంగా శ్రీ కల్యాణ శ్రీనివాసుడి వసంతోత్సవం
వైభవంగా శ్రీ కల్యాణ శ్రీనివాసుడి వసంతోత్సవం
తిరుపతి, 2019 మార్చి 01: శ్రీనివాసమంగాపురంలోని శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం సాయంత్రం 3.00 నుండి 4.30 గంటల వరకు వసంతోత్సవం వైభవంగా జరిగింది.
వసంతఋతువులో మలయప్పస్వామికి జరిగే ఈ ఉత్సవానికి ‘వసంతోత్సవ’మని పేరు ఏర్పడింది. సుగంధ సంభరిత వికాస పుష్పాలను స్వామికి సమర్పించుటమే కాక వివిధ రకాల ఫలాలను తెచ్చి స్వామికి నివేదించుట కూడా ఈ వసంతోత్సవంలో ప్రధాన ప్రక్రియ.
బ్రహ్మోత్సవాలలోస్వామి, అమ్మవార్లు ఉదయం, సాయంత్రం అలంకరణలు, వాహనసేవల్లో పాల్గొని అలసి వుంటారు కావున ఉపశమనం కల్పించేందుకు వసంతోత్సవాలు నిర్వహిస్తారని అర్చకులు తెలిపారు. వసంతోత్సవంలో భాగంగా చందనంతోపాటు పలురకాల సుగంధ పరిమళ ద్రవ్యాలతో శ్రీ భూ సమేత శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారికి విశేషంగా అభిషేకం నిర్వహించారు. అనంతరం అర్చకులు, భక్తులు అహ్లాదకరంగా వసంతాలు ( గంథం కలిపిన నీళ్ళు) చల్లుకున్నారు.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.