VASANTHOTSAVAM COMMENCES _ తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వసంతోత్సవాలు ప్రారంభం
Tiruchanoor, 6 May 20: The annual three day vasanthotsavams at Tiruchanoor commenced on Wednesday.
In view of ongoing COVID 19 lockdown, the annual event is being observed in Ekantam in Sri Padmavathi Ammavari temple.
The Archakas performed snapanam with milk, honey, curd, sandal, turmeric, and vermilion and coconut water to processional deity of Ammavaru seated on a platform in Sri Krishna Mukha Mandapam as per Pancharatra Agama Vidhi.
The procession of Ammavaru is also observed within the temple premises between 7pm and 7:30pm.
Temple DyEO Smt Jhansi Rani, Agama Advisor Sri Srinivasacharyulu, Kankana Bhattar Sri Manikantha Swamy, AEO Sri Subramanyam were also present.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వసంతోత్సవాలు ప్రారంభం
తిరుపతి, 2020 మే 06: తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక వసంతోత్సవాలు బుధవారం ప్రారంభమయ్యాయి. కరోనా వైరస్ వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా ఈ ఉత్సవాలను ఆలయ ప్రాంగణంలోనే ఏకాంతంగా నిర్వహిస్తున్నారు.
వసంతోత్సవాల్లో భాగంగా మధ్యాహ్నం 2.30 నుండి 4.30 గంటల వరకు ఆలయంలోని శ్రీకృష్ణ ముఖ మండపంలో అమ్మవారి ఉత్సవర్లకు స్నపనతిరుమంజనం చేపట్టారు. ఇందులో భాగంగా పసుపు, కుంకుమ, పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరినీళ్లతో అభిషేకం చేశారు. అలాగే రాత్రి 7 నుండి 7.30 గంటల వరకు ఆలయ ప్రాంగణంలోనే అమ్మవారి ఊరేగింపు నిర్వహిస్తారు.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటి ఈఓ శ్రీమతి ఝాన్సీరాణి, ఆగమ సలహాదారు శ్రీ శ్రీనివాసాచార్యులు, ఏఈఓ శ్రీ సుబ్రమణ్యం, కంకణభట్టార్ శ్రీ మణికంఠస్వామి తదితరులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.