VASANTHOTSAVAMS CONCLUDES _ వైభవంగా ముగిసిన శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు

TIRUMALA, 16 APRIL 2022: The three-day annual Vasanthotsavams of Lord Venkateswara concluded here on Saturday.

 

Snapana Tirumanjanam was performed to the utsava deities of Sri Malayappa and his two divine consorts, Sri Rama, Sita, Lakshmana and Hanuman besides Sri Krishna and Goddess Rukmini.

 

The idols of the deities were placed on a high altar while the priests carried out the ritual amid chanting of Vedic hymns.

 

This will be followed by asthanam to the deities in the evening after which the deities were taken around the mada streets around the hill temple in a grand procession on three palanquins.

 

The festival which was  graced by both the senior and junior pontiffs of Tirumala and other temple officials in Vasanta Mandapam besides devotees.

 

In view of Vasanthotsavam, TTD has cancelled Pournami Garuda Seva.

 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

వైభవంగా ముగిసిన శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు

తిరుమ‌ల‌, 2022 ఏప్రిల్ 16: తిరుమలలోని శ్రీ‌వారి ఆల‌యం వెనుక వైపు గల వసంతోత్సవ మండపంలో మూడురోజులపాటు అంగరంగ వైభవంగా జ‌రిగిన‌ సాలకట్ల వసంతోత్సవాలు శ‌నివారంనాడు కన్నులపండుగగా ముగిశాయి.

తొలిరోజు, రెండవరోజు శ్రీ మలయప్పస్వామివారు తన ఉభయదేవేరులతో క‌లిసి వసంతోత్సవంలో పాల్గొనగా చివరిరోజున శ్రీ‌దేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పతో బాటుగా శ్రీ సీతారామలక్ష్మణ సమేత ఆంజనేయస్వామివారు, శ్రీరుక్మిణీ సమేత శ్రీకృష్ణస్వామివారు వసంతోత్సవ సేవలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ఆద్యంతం నేత్రపర్వంగా సాగింది.

కాగా మధ్యాహ్నం 2 నుండి 4 గంటల వరకు స్వామి, అమ్మవార్ల ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్ళు, పసుపు, చందనంతో అభిషేకం చేశారు. ఒకే వేదికపై స‌మ‌స్త‌మైన ఉత్స‌వ‌ర్ల‌ను ద‌ర్శించిన భక్తులు తన్మయత్వంతో పులకించారు.

వసంతోత్సవ వేడుకలను పురస్కరించుకొని ప్రతినెలా పౌర్ణమినాడు తిరుమలలో నిర్వహించే గరుడసేవను టిటిడి రద్దు చేసింది.

ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ ర‌మేష్‌బాబు, పేష్కార్ శ్రీ శ్రీ‌హ‌రి ఇతర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.