VASANTOTHSAVAMS CONCLUDES _ తిరుచానూరులో ముగిసిన శ్రీ పద్మావతి అమ్మవారి వసంతోత్సవాలు – పాల్గొన్న టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి

Tiruchanoor, 27 May 2021: The annual Vasantothsavams in Sri Padmavathi Ammavari Temple at Tiruchanoor concluded on a grand religious note on Thursday.

As a part of the festivities, Snapana Tirumanjanam was held to the processional deity Padmavathi Devi in Aseervachana Mandapam between 2:30pm and 4:30pm. Due to Covid guidelines, the annual fete was held in Ekantam.

TTD Chairman Sri YV Subba Reddy, Deputy EO Smt Kasturi Bai and others were also present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

తిరుచానూరులో ముగిసిన శ్రీ పద్మావతి అమ్మవారి వసంతోత్సవాలు
– పాల్గొన్న టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి

తిరుచానూరు, 2021 మే 27: తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో మూడు రోజుల పాటు జరిగిన వార్షిక వసంతోత్సవాలు గురువారం ముగిశాయి. కోవిడ్ – 19 వ్యాప్తి నివార‌ణ చ‌ర్య‌ల్లో భాగంగా ఈ ఉత్స‌వాల‌ను ఆల‌య ప్రాంగ‌ణంలోనే ఏకాంతంగా నిర్వహించారు.

వసంతోత్సవాల్లో భాగంగా మ‌ధ్యాహ్నం 2.30 నుండి 4.30 గంటల వరకు ఆల‌యంలోని ఆశీర్వ‌చ‌న మండపంలో అమ్మవారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో భాగంగా పసుపు, కుంకుమ, పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరినీళ్లతో అభిషేకం చేశారు.

సాయంత్రం 6 నుండి రాత్రి 7 గంట‌ల వ‌ర‌కు వేద పారాయ‌ణం, మంగళ వాయిద్యాలు, రాత్రి 7 నుండి 7.30 గంటల వరకు ఆల‌య ప్రాంగ‌ణంలోనే అమ్మవారి ఊరేగింపు నిర్వ‌హిస్తారు. అనంతరం మహా పూర్ణాహూతితో అమ్మవారి వసంతోత్సవాలు ముగుస్తాయి.

ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి క‌స్తూరి బాయి, ఆగమ సలహాదారు శ్రీ శ్రీనివాసాచార్యులు, ఏఈవో శ్రీ ప్ర‌భాక‌ర్ రెడ్డి, ఆల‌య అర్చ‌కులు శ్రీ బాబు స్వామి, సూప‌రింటెండెంట్ శ్రీ మ‌ధు, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.