VEDAS ARE SOURCE ETHICAL EMPOWERMENT _ వేదాల ద్వారా విలువలతో కూడిన జీవనం : శ్రీశ్రీశ్రీ త్రిదండి అహోబిల రామానుజ జీయర్‌స్వామి
Tiruchanoor, 28 Nov. 19: The Pontiff of Sri Ramanuja Sahasrabdi Peetham, Sri Sri Tridandi Ahobila Ramanuja Chinna Jiyar Swamy during his anugrahabhashanam advocated that Vedas are source to lead an ethical life.
During his religious discourse on the platform of Srinivasa Veda Vidwat Sadas at Asthana Mandapam in Tiruchanoor on Thursday said, Vedas empower the way of leading a life on a righteous path.
Pancharatra Agama Advisor Sri K Srinivasacharyulu, SV Higher Vedic Studies Project Officer Dr A Vibhishana Sharma and other vedic scholars and students were also present.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI
వేదాల ద్వారా విలువలతో కూడిన జీవనం : శ్రీశ్రీశ్రీ త్రిదండి అహోబిల రామానుజ జీయర్‌స్వామి
తిరుపతి, 2019 నవంబరు 28: వేద ప్రామాణికంగా నడుచుకుంటే నైతిక విలువలతో కూడిన జీవనం అలవడుతుందని హైదరాబాద్‌లోని ఉభయవేదాంత ఆచార్య పీఠం అధ్యక్షులు శ్రీశ్రీశ్రీ త్రిదండి అహోబిల రామానుజ జీయర్‌స్వామి ఉద్ఘాటించారు. అమ్మవారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని టిటిడి ఎస్వీ ఉన్నత వేదాధ్యయన సంస్థ ఆధ్వర్యంలో తిరుచానూరులోని ఆస్థాన మండపంలో ఉదయం 6 నుండి 7.30 గంటల వరకు శ్రీనివాస వేద విద్వత్ సదస్సులో భాగంగా ప్రముఖ స్వామీజీల అనుగ్రహ భాషణం నిర్వహిస్తున్నారు.
ఇందులో భాగంగా గురువారం శ్రీశ్రీశ్రీ త్రిదండి అహోబిల రామానుజ జీయర్‌స్వామి “చతుశ్లోకి – వేదమూలకత్వం” అనే అంశంపై అనుగ్రహ భాషణం చేశారు. విద్యామదం, కులమదం, ధనమదం తొలగించుకుంటే మానవులు సక్రమమైన మార్గంలో పయనించినట్టు అవుతుందన్నారు. మానవాళి శ్రేయస్సు కోసమే భగవంతుడు వేదాలను సృష్టించాడని తెలియజేశారు. అంతకుముందు వేదపండితులు చతుర్వేద పారాయణం చేశారు. ఈ సందర్భంగా స్వామీజీని శాలువ, శ్రీవారి ప్రసాదంతో సత్కరించారు.
ఎస్వీ ఉన్నత వేదాధ్యయన సంస్థ ప్రాజెక్టు అధికారి డా. ఆకెళ్ల విభీషణశర్మ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పాంచరాత్ర ఆగమ సలహాదారు శ్రీ కాండూరి శ్రీనివాసాచార్యులు, పలువురు వేదపండితులు, ఎస్వీ వేద విశ్వవిద్యాలయం, రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.