VEDAS, BENCHMARK OF SANATANA HINDU DHARMA, SAYS BRAHMARASHI CHAGANTI KOTESWARA RAO

Tirumala, 25 Feb. 21: Brahmarashi Chaganti Koteswar Rao said on Thursday that pursuit of Sanatana Dharma was instrumental in the all-round development of humanity with the propagation of Vedas as its benchmark.

He was participating in the Akhanda Rigveda parayanams at the Ranganayakula Mandapam in the Srivari temple.

Speaking later, the Brahmarashi said Vedas were true representative of Almighty and could not be recreated by anyone else.

Highlighting the significance of Vedas for its powerful quotient of both spiritual and scientific knowledge, he said study and pursuit of Vedas taught Dharmic values as ingredients of peace, health and prosperity in society.

He hailed TTD for its endeavour of promoting Vedic studies and preservation of Vedic culture through Akhanda Veda Parayanams.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

స‌నాత‌న ధ‌ర్మానికి వేదం ప్ర‌మాణం : బ్ర‌హ్మ‌శ్రీ చాగంటి కోటేశ్వ‌ర‌రావు

తిరుమల, 2021 ఫిబ్ర‌వ‌రి 25: మాన‌వాళి పురోభివృద్ధి సాధించాలంటే అన్ని కార్య‌క్ర‌మాలు ధ‌ర్మ‌బ‌ద్ధంగా జ‌ర‌గాల‌ని, అలాంటి స‌నాత‌న ధ‌ర్మానికి వేదం ప్ర‌మాణ‌మ‌ని ప్ర‌ముఖ ఆధ్యాత్మికవేత్త బ్ర‌హ్మ‌శ్రీ చాగంటి కోటేశ్వ‌ర‌రావు ఉద్ఘాటించారు. తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలోని రంగ‌నాయ‌కుల మండ‌పంలో జ‌రుగుతున్న అఖండ ఋగ్వేద పారాయ‌ణంలో గురువారం శ్రీ చాగంటి పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా బ్ర‌హ్మ‌శ్రీ చాగంటి కోటేశ్వ‌ర‌రావు ఉప‌న్య‌సిస్తూ వేదాలు అపౌరుషేయాల‌ని, వీటిని ఎవ‌రూ ర‌చించ‌లేద‌ని, సాక్షాత్తు భ‌గ‌వంతుని స్వ‌రూప‌మ‌ని తెలిపారు. వేదాలు చాలా శ‌క్తిమంత‌వైన‌వ‌ని, ఇవి ఏక‌త్వాన్ని ప్ర‌బోధిస్తాయ‌ని తెలిపారు. వేద విద్య అజ్ఞానాన్ని దూరం చేసి ఆత్మ‌జ్ఞానాన్ని అందిస్తుంద‌న్నారు. వేదాల్లో ఆధ్యాత్మిక జ్ఞానంతోపాటు సాంకేతిక ప‌రిజ్ఞానం దాగి ఉంద‌న్నారు. వేదాలు, ఉప‌నిష‌త్తులు, పురాణాలు మాన‌వీయ‌, నైతిక‌, ధార్మిక విలువ‌ల‌ను మాన‌వాళికి బోధిస్తాయ‌ని, ప్ర‌తి ఒక్క‌రూ వాటిని చ‌ద‌వాల‌ని కోరారు. లోకం సుభిక్షంగా ఉండాలంటే వేదాల సారాన్ని వ్యాప్తి చేయాల‌న్నారు. వేదప‌రిర‌క్ష‌ణ కోసం టిటిడి చేస్తున్న కృషి అభినంద‌నీయ‌మ‌న్నారు. లోక‌క‌ల్యాణం కోసం టిటిడి అఖండంగా వేద‌పారాయ‌ణం చేయిస్తుండ‌డం గొప్ప విష‌య‌మ‌న్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.