VEENAPANI ON HAMSAVENI _ హంస వాహనంపై స‌ర‌స్వ‌తీ అలంకారంలో కల్యాణ శ్రీనివాసుడు

Srinivasa Mangapuram, 15 Feb. 20: Sri Kalyana Venkateswara Swamy at Srinivasa Mangapuram glided on Hamsa Vahanam on the second day evening on Saturday as a part of the ongoing annual brahmotsavams. 

The temple premises were crowded with pilgrims taking part in the annual fete with utmost devotion.

Lord donned the avatara of Goddess Saraswathi, the divine mother of Wisdom to cheer the devotees. 

DyEO Sri Elleppa, Suptd Sri Chengalrayulu, Temple Inspector Sri Anil, other officials, devotees were also present.

ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI  

 

 

హంస వాహనంపై స‌ర‌స్వ‌తీ అలంకారంలో కల్యాణ శ్రీనివాసుడు

తిరుపతి, 2020 ఫిబ్రవరి 15: శ్రీనివాసమంగాపురంలోని శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన శ‌నివారం రాత్రి అనంతతేజోమూర్తి అయిన శ్రీనివాసుడు స‌ర‌స్వ‌తి దేవి అలంకారంలో హంస‌ వాహనంపై భక్తులకు అభయమిచ్చారు. రాత్రి 8.00 నుండి 9.00 గంటల వరకు స్వామివారు నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. వాహనం ముందు గజరాజులు ఠీవిగా నడుస్తుండగా, భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.

రెండో రోజు రాత్రి శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారు వీణ ధరించి సరస్వతీరూపంతో భక్తులను అనుగ్రహంచారు.  సారం లేనిదాన్ని వదలి, సారవంతమైన దాన్ని స్వీకరించే ఉత్తమజ్ఞానానికి హంస సంకేతం. జ్ఞానరూప పరమహంస అయిన కల్యాణ వేంకటేశ్వరుడు భౌతికరూపమైన హంసగా రూపొంది తన దివ్యతత్తాన్ని వెల్లడిస్తాడు. హంస సరస్వతికీ వాహనం. కనుక కల్యాణదేవుడు సరస్వతీరూపంతో వీణాపుస్తకపాణియై దర్శనమివ్వడం జ్ఞానవిజ్ఞానచైతన్య శుద్ధసత్త్వగుణానికి నిదర్శనం. భక్తులు హంసల వలె నిర్మలమనస్కులై ఉంటే, వాళ్ల హృదయాల్లో తాను శాశ్వతంగా అధివసించి ఉంటానని ఈ వాహనం ద్వారా స్వామివారు సెలవిస్తున్నారు.
     

ఈ కార్యక్రమంలో టిటిడి ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ ఎల్ల‌ప్ప‌, ఏఈవో శ్రీ ధ‌నంజ‌యుడు, సూపరింటెండెంట్‌  శ్రీ చెంగ‌ల్రాయులు, ప్రధాన అర్చ‌కులు శ్రీ బాలాజీ రంగాచార్యులు, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ శ్రీ అనిల్ కుమార్‌, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు, విశేష సంఖ్య‌లో భ‌క్తులు పాల్గొన్నారు.

శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి బ్రహ్మోత్సవాల్లో విశేషంగా ఆక‌ట్టుకుంటున్న సాంస్కృతిక కార్య‌క్ర‌మాలు

శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల సంద‌ర్భంగా ఆల‌యంలో నిర్వ‌హిస్తున్న ధార్మిక‌, సంగీత‌, సాంస్కృతిక కార్య‌క్ర‌మాలు భ‌క్తుల‌ను విశేషంగా ఆక‌ట్టుకుంటున్నాయి. టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్న‌మాచార్య ప్రాజెక్టు, దాస‌సాహిత్య ప్రాజెక్టు, శ్రీ‌వేంక‌టేశ్వ‌ర సంగీత‌, నృత్య క‌ళాశాల ఆధ్వర్యంలో ఈ కార్య‌క్ర‌మాల‌ను ఏర్పాటుచేశారు. ఇందులో భాగంగా శ‌నివారం నిర్వ‌హించిన కార్య‌క్ర‌మాల వివ‌రాలిలా ఉన్నాయి.
           

శ్రీ‌నివాస‌మంగాపురం శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆల‌య మండ‌పంలో శ్రీ ఎం.హ‌రిబాబు బృందం ఉదయం 6.00 నుండి 6.30 గంటల వరకు మంగళధ్వని, ఉదయం 6.30 నుండి 8.00 గంటల వరకు డా.సి.ఉమాదేవి బృందం విష్ణుస‌హ‌స్ర‌నామ పారాయ‌ణం నిర్వహించారు. ఉదయం 10.00 నుండి 11.00 గంటల వరకు భ‌ద్రాచ‌లంకు చెందిన శ్రీ జి.ముర‌ళీకృష్ణ‌మార్యుచాలు ధార్మికోప‌న్యాసం చేశారు.
       

మ‌ధ్యాహ్నం 3.00 నుండి 4.00 గంటల వరకు మ‌ద‌న‌ప‌ల్లికి  చెందిన టి.ఎమ్‌.నాగ‌మ‌ణి బృందం హ‌రిక‌థ పారాయ‌ణం,  సాయంత్రం 4.00 నుండి  5.00 గంట‌ల వ‌ర‌కు తిరుప‌తికి చెందిన శ్రీ ఆర్‌.శ్యాంకుమార్ బృందంచే అన్న‌మ‌య్య విన్న‌పాలు,  సాయంత్రం 5.00 నుండి 6.00 గంటల వరకు తిరుప‌తికి చెందిన బి.మంజుల బృందం  భ‌క్తి సంగీతం వినిపించారు. సాయంత్రం 6.00 నుండి 7.00 గంట‌ల వ‌ర‌కు ఊంజల్‌ సేవలో అన్న‌మ‌య్య సంకీర్తన‌ల‌ను ఆల‌పించారు.
       
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.