CHANDRASEKHARA SHINES ON CHANDRAPRABHA _ చంద్ర‌ప్ర‌భ వాహనంపై శ్రీ కపిలేశ్వరస్వామివారు క‌నువిందు

Tirupati, 15 Feb. 20: On the evening of Saturday, Sri Somaskandamurthy glittered on Chandraprabha vahanam as a part of Kapileswara swamy brahmotsavams in Tirupati. 

The beauty of the Moon God enhances when Lord Shiva adorns Moon as his head ornament. 

The kolatams, bhajana brindams attracted the denizena who gathered in the streets to catch a glimpse of vahana seva. 

DyEO Sri Subramanyam, Superintendent Sri Bhupati, Temple Inspectors Sri Reddy Sekhar, Sri Srinivasa Naik and other office staff were also present. 

ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI  

చంద్ర‌ప్ర‌భ వాహనంపై శ్రీ కపిలేశ్వరస్వామివారు క‌నువిందు

ఫిబ్రవరి 15, తిరుపతి, 2020: తిరుపతిలోని శ్రీకపిలేశ్వరస్వామివారి వార్షిక‌ బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన శ‌నివారం రాత్రి 7 నుండి 9 గంటల వరకు చంద్ర‌ప్ర‌భ వాహనంపై శ్రీ కపిలేశ్వరస్వామివారు తిరుపతి పురవీధుల్లో భక్తులకు అభయమిచ్చారు. గజాలు, వృషభాలు ముందు వెళుతుండగా, కళాబృందాల కోలాటాల నడుమ వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించారు.

శివుడు అష్టమూర్తి స్వరూపుడు. సూర్యుడు, చంద్రుడు, భూమి, నీరు, అగ్ని, వాయువు ఆకాశము, యజమానుడు శివుడి ప్రత్యక్షమూర్తులు. చంద్రుడు అమృతమూర్తి. వెన్నెల కురిపించి జీవకోటి మనస్సులకు ఆనందాన్ని కలిగించే షోడశకళాప్రపూర్ణుడు. శివభగవానుడు విభూతి సౌందర్యంతో ధవళతేజస్సుతో వెలుగొందుతూ తన కరుణ కిరణాలతో అమృత శీతలకాంతులను జీవులకు అనుగ్రహిస్తాడు.
 

ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ సుబ్రమణ్యం, సూపరింటెండెంట్‌ శ్రీ భూప‌తిరాజు, ఎవిఎస్వో శ్రీ సురేంద్ర‌, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్లు శ్రీ రెడ్డిశేఖ‌ర్‌, శ్రీ శ్రీ‌నివాస్‌నాయ‌క్ ఇత‌ర అధికారులు, విశేష సంఖ్య‌లో భ‌క్తులు  పాల్గొన్నారు.

శ్రీ క‌పిలేశ్వ‌రస్వామివారి బ్ర‌హ్మోత్స‌వాల్లో క‌ళానీరాజ‌నం

తిరుప‌తిలోని శ్రీ క‌పిలేశ్వ‌ర‌స్వామివారి బ్ర‌హ్మోత్స‌వాల‌ సంద‌ర్భంగా నిర్వ‌హిస్తున్న ధార్మిక‌, సంగీత‌, సాంస్కృతిక కార్య‌క్ర‌మాలు భ‌క్తుల‌ను విశేషంగా ఆక‌ట్టుకుంటున్నాయి. టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో ఈ కార్య‌క్ర‌మాల‌ను ఏర్పాటుచేశారు. ఇందులో భాగంగా శ‌నివారం నిర్వ‌హించిన కార్య‌క్ర‌మాల వివ‌రాలిలా ఉన్నాయి.

శ్రీ క‌పిలేశ్వ‌రస్వామివారి ఆల‌య ప్రాంగ‌ణంలో ఉదయం 6 నుండి 6.30 గంటల వరకు తిరుప‌తికి చెందిన శ్రీ బి.కేశ‌న్న బృందం మంగళధ్వని, ఉదయం 6.30 నుండి 7 గంటల వరకు తిరుప‌తికి చెందిన డా. వి.కృష్ణ‌వేణి బృందం శివ‌స్తోత్రం నిర్వ‌హించారు. ఉదయం 10 నుండి 11 గంటల వరకు తిరుప‌తిలోని రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం ఆచార్యులు శ్రీ రాణి స‌దాశివ‌మూర్తి ధార్మికోప‌న్యాసం చేశారు. సాయంత్రం 3 నుండి 4 గంటల వరకు తిరుప‌తికి చెందిన శ్రీ జి.చంద్ర‌శేఖ‌ర్ బృందం హ‌రిక‌థ పారాయ‌ణం చేశారు. సాయంత్రం 4 నుండి 5 గంట‌ల వ‌ర‌కు, తిరిగి సాయంత్రం 6 నుండి రాత్రి 7 గంటల వరకు ఊంజ‌ల్‌సేవ‌లో తిరుప‌తికి చెందిన శ్రీ బి.ర‌ఘునాథ్ బృందం అన్న‌మ‌య్య విన్న‌పాలు సంకీర్తనాలాప‌న, సాయంత్రం 5 నుండి 6 గంట‌ల వ‌ర‌కు తిరుప‌తికి చెందిన శ్రీ ఎం.ర‌విచంద్ర బృందం భ‌క్తి సంగీతం వినిపించారు.

అదేవిధంగా తిరుపతిలోని అన్న‌మాచార్య క‌ళామందిరంలో సాయంత్రం 6.30 నుండి రాత్రి 8.30 గంట‌ల వ‌ర‌కు తిరుప‌తికి చెందిన శ్రీ పి.శ్రీ‌నివాస కుమార్‌, శ్రీ‌మ‌తి కె.ల‌క్ష్మీరాజ్యం బృందం భ‌క్తి సంగీత కార్య‌క్ర‌మం నిర్వ‌హిస్తారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.