VENGAMA JAYANTHI FETE COMMENCES _ మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ 292వ జయంతి ఉత్సవాలు ప్రారంభం
TIRUPATI, 14 MAY 2022: TTD is observing the Jayanthi festivities of Matrusri Tarigonda Vengamamba in a big way.
The 18th-century saint poetess Jayanthi fete already commenced on Saturday at Tarigonda, her birth place.
Floral tributes will be paid to the Vengamamba statue at Tirupati and Brindavanam at Tirumala on Sunday.
While a special program will be observed on Sunday at Narayanagiri Gardens with Gosti Ganam between 6pm and 7pm. Visakha Sarada Peetham seer Sri Swarupannda Swamy will render Anugraha Bhashanam on the occasion.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI
మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ 292వ జయంతి ఉత్సవాలు ప్రారంభం
తిరుపతి, 2022 మే 14: భక్త కవయిత్రి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ 292వ జయంతి ఉత్సవాలు శనివారం ప్రారంభమయ్యాయి.
తరిగొండలో…
తరిగొండలోని శ్రీ లక్ష్మీనృసింహస్వామి ఆలయ ప్రాంగణంలో స్వామి, అమ్మవారి ఉత్సవమూర్తులకు స్నపనతిరుమంజనం నిర్వహించారు. అనంతరం పుష్పగిరి పీఠాధిపతి శ్రీ విద్యాశంకర స్వామి వారు వెంగమాంబ విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. సాయంత్రం సంగీత సభ, హరికథ కార్యక్రమాలు జరిగాయి.
మే 15వ తేదీన ఉదయం 9 గంటలకు శ్రీ లక్ష్మీనృసింహస్వామివారి కల్యాణోత్సవం జరుగనుంది. ఆ తరువాత సంగీత కార్యక్రమాలు నిర్వహిస్తారు.
తిరుపతిలో…
తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో శనివారం ఉ.10 గం.టల నుండి 11.30 గం.ల వరకు తిరుపతికి చెందిన శ్రీ ఎ. రాజమోహన్, శ్రీమతి తేజోవతి బృందంచే గాత్రం, ఉ.11.30 నుండి మధ్యాహ్నం 1 గం. వరకు శ్రీ చంద్రశేఖర్ బృందంచే హరికథ జరిగాయి. సాయంత్రం 6.30 గంటలకు ఎస్వీ సంగీత కళాశాలకు చెందిన శ్రీమతి ఉమాముద్దుబాల బృందంచే భరతనాట్య ప్రదర్శన జరిగింది.
మే 15వ తేది ఉదయం 9 నుండి 10 గంటల వరకు తిరుపతి ఎం.ఆర్.పల్లి సర్కిల్ వద్ద ఉన్న మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ విగ్రహానికి పుష్పాంజలి సమర్పిస్తారు. అన్నమాచార్య కళామందిరంలో ఉదయం 10 గంటలకు సాహితీ సదస్సు జరుగనుంది. సాయంత్రం 6 గంటల నుండి సంగీత సభ జరుగనుంది.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.