తిరుపతిలో మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ విగ్రహానికి ఘనంగా పుష్పాంజలి


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

తిరుపతిలో మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ విగ్రహానికి ఘనంగా పుష్పాంజలి

తిరుపతి, 2018 ఆగస్టు 19: భక్త కవయిత్రి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ 201వ వర్ధంతిని పురస్కరించుకుని తిరుపతిలోని ఎం.ఆర్‌.పల్లి సర్కిల్‌ వద్ద గల వెంగమాంబ విగ్రహానికి తరిగొండ వెంగమాంబ ప్రాజెక్టు సమన్వయాధికారి ఆచార్య కె.జె.కృష్ణమూర్తి ఆదివారం ఘనంగా పుష్పాంజలి ఘటించారు.

వర్ధంతి ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో సాయంత్రం 6.00 గంటలకు తిరుపతికి చెందిన శ్రీమతి కె. విశాలాక్షి మరియు శ్రీమతి జి. రేవతి బృందం, అన్నమాచార్య ప్రాజెక్ట్‌ కళాకారులచే సంగీతసభ నిర్వహించనున్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.