VENGAMAMBA GARLANDED_ తిరుపతిలో మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ విగ్రహానికి ఘనంగా పుష్పాంజలి
Tirupati, 9 Aug. 19: Floral tributes were paid to Matrusri Tarigonda Vengamamba on her 202nd Jayanthi fete on Friday.
The Director of Annamacharya Project Sri B Vishwanath along with Vengamamba Project Co-ordinator Dr KJ Krishnamurthy garlanded the statues of saint poetess at MR Palle on Friday.
The later literary fete was also held at Annamacharya Kalamandiram followed by a musical concert.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
తిరుపతిలో మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ విగ్రహానికి ఘనంగా పుష్పాంజలి
తిరుపతి, 2019 ఆగస్టు 09: భక్త కవయిత్రి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ 202వ వర్ధంతిని పురస్కరించుకుని తిరుపతిలోని ఎం.ఆర్.పల్లి సర్కిల్ వద్ద గల వెంగమాంబ విగ్రహానికి తరిగొండ వెంగమాంబ ప్రాజెక్టు సంచాలకులు ఆచార్య విశ్వనాథ్ శుక్రవారం ఘనంగా పుష్పాంజలి ఘటించారు.
వర్ధంతి ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో ఉదయం 10.00 నుండి 11.00 గంటల వరకు తిరుపతికి చెందిన శ్రీ ఎ.రాజమోహన్ మరియు శ్రీమతి అన్నపూర్ణ గాత్ర సంగీతం, ఉదయం 11.00 నుండి మధ్యాహ్నం 1.00 గంట వరకు తిరుపతికి చెందిన శ్రీమతి జె.కృష్ణకుమారి బృందం హరికథ పారాయణం చేయనున్నారు. సాయంత్రం 6.00 నుండి రాత్రి 8.00 గంటల వరకు తిరుపతికి చెందిన శ్రీమతి జి.రేవతి, జి.లావణ్య బృందం గాత్ర సంగీత సభ నిర్వహించనున్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.