TRIBUTES PAID TO VENGAMAMBA_ తరిగొండ వెంగమాంబ బృందావనంలో ఘనంగా పుష్పాంజలి

Tirumala, 9 Aug. 19: Floral tributes were paid to Matrusri Tarigonda Vengamamba at her Samadhi in Tirumala on Friday on the occasion of 202nd Jayanthi of the saint poetess.

Speaking on the occasion Tarigonda Vengamamba Project Co-ordinator Dr KJ Krishnamurthy, Annamacharya Project Director Sri Vishwanath said that Vengamamba penned many great works in praise of Lord Venkateswara and Lakshmi Narasimha Swamy.

They said Vengamamba was a social reformer and pioneered Annaprasadam at Tirumala.


ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

తరిగొండ వెంగమాంబ బృందావనంలో ఘనంగా పుష్పాంజలి

తిరుమల, 2019 ఆగస్టు 09: మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ 202వ వర్ధంతిని పురస్కరించుకుని తిరుమలలోని వెంగమాంబ బృందావనంలో శుక్ర‌వారం తరిగొండ వెంగమాంబ వాఙ్మ‌య‌ ప్రాజెక్టు సంచాల‌కులు ఆచార్య బి.విశ్వ‌నాథ్ ఘనంగా పుష్పాంజలి సమర్పించారు.

ఈ సందర్భంగా ఆచార్య విశ్వ‌నాథ్ మాట్లాడుతూ వెంగ‌మాంబ శ్రీ‌వారిలో ఐక్య‌మైన రోజు కావ‌డంతో ఇక్క‌డి బృందావ‌నంలో పుష్పాంజ‌లి స‌మ‌ర్పించిన‌ట్టు తెలిపారు. ఇక‌పై జ‌యంతి, వ‌ర్ధంతి బ‌దులు ఆరాధ‌నోత్స‌వాలుగా నిర్వ‌హిస్తామ‌ని చెప్పారు. గురు, శుక్ర‌వారాల్లో తిరుప‌తి, త‌రిగొండ‌, తిరుమ‌ల‌లో ధార్మిక‌, సంగీత‌, సాహిత్య కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించిన‌ట్టు తెలిపారు.

తరిగొండ వెంగమాంబ వాఙ్మ‌య‌ ప్రాజెక్టు పూర్వ స‌మ‌న్వ‌యాధికారి ఆచార్య కె.జె.కృష్ణమూర్తి మాట్లాడుతూ శ్రీవారి ఆపర భక్తురాలైన మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ తిరుమలలో మొదటగా అన్నప్రసాద వితరణను ప్రారంభించారని చెప్పారు. శ్రీ‌వారికి ఏకాంత‌సేవ స‌మ‌యంలో అన్న‌మ‌య్య లాలి – వెంగమాంబ ముత్యాలహారతి నేటికీ కొనసాగుతున్నాయ‌న్నారు. శ్రీ తాళ్ల‌పాక అన్న‌మ‌య్య‌, వెంగ‌మాంబ ఇద్ద‌రూ స్వామివారికి సాహితీ కైంక‌ర్యం చేసి త‌రించార‌ని వివరించారు.

ఈ కార్య‌క్ర‌మంలో వెంగ‌మాంబ వంశీయులు శ్రీ విశ్వ‌మూర్తి, అన్న‌మాచార్య ప్రాజెక్టు సూప‌రింటెండెంట్ శ్రీ ఎన్‌.వెంక‌ట‌ర‌మ‌ణ‌, సీనియ‌ర్ అసిస్టెంట్ శ్రీ న‌ర‌సింహులు త‌దిత‌రులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.