VENUGOPALA KRISHNA BLESSES DEVOTEES _ సహస్రదీపాలంకార సేవలో వేణుగోపాలకృష్ణుడి అలంకారంలో శ్రీనివాసుని అభయం
HYDERABAD, 14 OCTOBER 2022: As part of ongoing Sri Venkateswara Vaibhavotsavams in Hyderabad, on the fourth day evening, Srivaru as Sri Venugopala Krishna blessed His devotees.
The deity in all His celestial splendour was seated on the swing and Sahasra Deepalankara Seva was performed on a pleasant evening.
Sri Parupalli Ranganath, Senior artist of Annamacharya Project rendered a few popular notes followed by the devotional concert by Sri RP Sravan of Chennai.
SRINIVASA KALYANAM
On October 15, Srinivasa Kalyanam will be performed between 6:30pm and 8:30pm.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
సహస్రదీపాలంకార సేవలో వేణుగోపాలకృష్ణుడి అలంకారంలో శ్రీనివాసుని అభయం
హైదరాబాద్, 2022 అక్టోబరు 14: హైదరాబాద్ లో టిటిడి నిర్వహిస్తున్న శ్రీవేంకటేశ్వర వైభవోత్సవాల్లో నాలుగో రోజు శుక్రవారం సాయంత్రం సహస్రదీపాలంకార సేవలో శ్రీ వేణుగోపాలకృష్ణుడి అలంకారంలో శ్రీనివాసుడు భక్తులకు అభయమిచ్చారు. స్వామివారు ఉల్లాసంగా ఊయలలో ఊగుతూ భక్తులకు కనువిందు చేశారు. నిత్యం అవిశ్రాంతంగా భక్తులకు దర్శనభాగ్యాన్ని ప్రసాదించే స్వామివారు సహస్రదీపాలంకార సేవతో సేద తీరుతారు.
ముందుగా వేద పండితులు చతుర్వేద పారాయణం చేశారు. ఆ తరువాత టిటిడి అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు శ్రీ పారుపల్లి రంగనాథ్ బృందం ‘ నారాయణతే నమో నమో…’, ‘అలరచంచలమైన ఆత్మలందుండ…’, అన్నమయ్య సంకీర్తనలను రసరమ్యంగా ఆలపించారు. ఆ తరువాత మంగళవాయిద్యంతో వాద్యనీరాజనం సమర్పించారు.
సహస్రదీపాలంకార సేవ అనంతరం చెన్నైకి చెందిన కళాకారుడు ఆర్.పి.శ్రవణ్ ఆలపించిన పలు భక్తి సంకీర్తనలు ఎంతగానో ఆకట్టుకున్నాయి.
సాయంత్రం 6.30 నుంచి రాత్రి 7.30 గంటల వరకు వేదిక చుట్టూ స్వామివారు తిరుచ్చిపై ఊరేగి భక్తులకు దర్శనమిచ్చారు. రాత్రి 7.30 నుంచి 8.30 గంటల వరకు రాత్రి కైంకర్యాలు నిర్వహిస్తారు. రాత్రి 8.30 నుంచి 9 గంటల వరకు ఏకాంతసేవ జరుగనుంది.
అక్టోబరు 15న శ్రీనివాస కల్యాణం
శ్రీ వేంకటేశ్వర వైభవోత్సవాల చివరి రోజైన అక్టోబర్ 15వ తేదీ శనివారం ఉదయం 8.30 నుండి 10.30 గంటల వరకు పుష్పయాగం జరుగనుంది. సాయంత్రం 6.30 రాత్రి 8.30 గంటల వరకు శ్రీనివాస కళ్యాణం జరుగనుంది. భక్తులు పెద్దసంఖ్యలో విచ్చేసి స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరడమైనది.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.