VENUGOPALA KRISHNA ON CHINNA SESHA _ చిన్నశేషవాహనంపై శ్రీ మురళి కృష్ణుడి అలంకారంలో శ్రీ కల్యాణ శ్రీనివాసుడు

TIRUPATI, 01 MARCH 2024: On the second day morning of the ongoing annual Brahmotsavams in Srinivasa Mangapuram, Sri Venugopala Krishna blessed His devotees on the five hooded Chinna Sesha Vahanam.

Friday also being Ma Yasodha Jayanti, Yasodha Krishna in all His cuteness charmed devotees.

The artists displayed various artforms in front of Chinna Sesha Vahanam.

Special Grade DyEO Smt Varalakshmi and other office staffs, religious staffs were also present.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

చిన్నశేషవాహనంపై శ్రీ మురళి కృష్ణుడి అలంకారంలో శ్రీ కల్యాణ శ్రీనివాసుడు

తిరుపతి, 2024 మార్చి 01: శ్రీనివాసమంగాపురం శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన శుక్ర‌వారం ఉదయం శ్రీనివాసుడు శ్రీ మురళి కృష్ణుడి అలంకారంలో చిన్నశేష వాహనంపై అభయమిచ్చారు.

రెండో రోజు ఉదయం శ్రీ కల్యాణ వేంకటేశ్వరుడు ఒక్కరే ఐదు తలలు గల చిన్నశేష వాహనాన్ని అధిష్టించారు. చిన్నశేష వాహనం శ్రీవారి వ్యక్తరూపమైన పాంచభౌతిక ప్రకృతికి సంకేతం. కనుక ఈ వాహనం పంచభూతాత్మకమైన విశ్వానికి, అందులో నివసించే జీవునికి వరాలిస్తుంది. విశ్వం కన్పించే శ్రీవారి ప్రకృతి. విష్ణువు ఈ ప్రకృతికి ఆధారమై దాన్ని నడిపించేశక్తి. స్వామి విశ్వాన్ని రక్షించేవాడు కనుక శేషునిపై తానొక్కడే విహరిస్తాడు. పంచశిరస్సుల చిన్నశేషుని దర్శనం మహాశ్రేయఃప్రదం.

స్నపన తిరుమంజనం :

అనంతరం ఉదయం 10.30 నుండి స్వామి, అమ్మవార్ల ఉత్స‌వ‌ర్ల‌కు వేడుకగా స్నపనతిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్ళు, పసుపు, చందనంల‌తో అభిషేకం చేపట్టారు. రాత్రి 7 నుండి 8 గంటల వరకు హంస వాహనంపై స్వామివారు దర్శనమివ్వనున్నారు.

ఈ కార్యక్రమంలో జేఈవో శ్రీ వీర‌బ్ర‌హ్మం, ఆలయ ప్ర‌త్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మి, ఏఈవో శ్రీ గోపినాథ్‌, వైఖానస ఆగమ సలహాదారులు శ్రీ మోహన రంగాచార్యులు, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.