PULSE POLIO IN TIRUMALA ON MARCH 03 _ మార్చి 3న తిరుమలలో పల్స్ పోలియో

TIRUMALA, 01 MARCH 2024: The pulse polio immunization drive to administer the polio vaccine to children below the age of five, would be held in Tirumala on March 3.

The programme will commence in front of Tirumala temple at 6am on March 3 and conclude at 6pm.

The pulse polio drops administration centres are being placed at different areas in Tirumala for the convenience of both the visiting pilgrims as well Tirumala locals.

A total of 25 centres have been identified which includes Aswini Hospital, RTC Bus stand, GNC toll gate, CRO, PAC 1 and 2, New bus stand, Health Office, VQC 1 and 2, ATC, MBC 34, Varahaswamy Rest House 1, Rambhageecha Rest House 1, KKc, Medaramitta, Papavinasanam, Supadham, footpath, Balaji Nagar Vinayaka temple, Balaji Nagar Balavadi, SV High School, Employees’ Dispensary besides inside and outside Tirumala temple.

An awareness rally will commence at 10.30am on Saturday from SV High School to Balaji Nagar covering all places followed by the mike announcements from 2pm onwards for the information of pilgrims and locals. 

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

మార్చి 3న తిరుమలలో పల్స్ పోలియో

తిరుమ‌ల‌, 2024 మార్చి 01: దేశవ్యాప్త కార్యక్రమంలో భాగంగా తిరుమలలో మార్చి 3వ తేదీ పల్స్ పోలియో కార్య‌క్ర‌మం జ‌రుగ‌నుంది.

ఐదేళ్లలోపు పిల్లలకు పోలియో చుక్కలు వేసే కార్యక్రమం మార్చి 3న ఉదయం 6 గంటలకు తిరుమల ఆలయం ముందు ప్రారంభమై సాయంత్రం 6 గంటలకు ముగుస్తుంది.
భక్తుల సౌకర్యార్థం తిరుమలలోని వివిధ ప్రాంతాల్లో పల్స్ పోలియో చుక్కల నిర్వహణ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అశ్విని ఆసుపత్రి, ఆర్టీసీ బస్టాండ్, జియన్ సి టోల్ గేట్, సిఆర్ ఓ, పిఎసి 1 మరియు 2, కొత్త బస్టాండ్, హెల్త్ ఆఫీస్, విక్యూసి 1 మరియు 2, ఏటిసి, ఎంబిసి-34, వరాహస్వామి విశ్రాంతి గృహం 1, రాంభగీచా రెస్ట్ హౌస్ 1, కేకేసి, మేదరమిట్ట, పాపవినాశనం, సుపాదం, బాలాజీ నగర్ వినాయక ఆలయం, బాలాజీ నగర్ బాల బడి, ఎస్వి హై స్కూల్, తిరుమల ఆలయం లోపల మరియు వెలుపల, ఉద్యోగుల డిస్పెన్సరీలతో సహా మొత్తం 25 కేంద్రాలలో పోలియో చుక్కలు వేస్తారు.

ఇందులో భాగంగా శనివారం ఉదయం 10.30 గంటలకు ఎస్వీ హైస్కూల్ నుంచి బాలాజీ నగర్ వరకు అవగాహన ర్యాలీ నిర్వహిస్తారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి యాత్రికులు మరియు స్థానికుల కొరకు జీపులో ప్రకటనలు చేస్తూ అవగాహన కలిగించనున్నారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.