VETURI PRABHAKARA SHASTRY JAYANTI OBSERVED _ ఘనంగా శ్రీమాన్ వేటూరి ప్రభాకరశాస్త్రి 136వ జయంతి
TIRUPATI, 07 FEBRUARY 2023: The 136 Jayanti ceremony of renowned scholar Sri Veturi Prabhakara Shastry was observed in Tirupati on Tuesday.
TTD DEO Sri Bhaskar Reddy garlanded the life-size statues of Sri Veturi located infront of SVETA Bhavan and SV Oriental College along with SVETA Director Smt Prasanti, Principal Sri Dr Narayanaswami Reddy and others.
On this occasion, they remembered the great services of Sri Veturi in bringing out Sri Tallapaka Annamacharya Sankeertans to public fold and popularizing his works.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
ఘనంగా శ్రీమాన్ వేటూరి ప్రభాకరశాస్త్రి 136వ జయంతి
తిరుపతి, 07 ఫిబ్రవరి 2023: శ్రీమాన్ వేటూరి ప్రభాకరశాస్త్రి 136వ జయంతి సందర్బంగా మంగళవారం శ్వేత భవనం ఎదురుగా, టీటీడీ ప్రాచ్య కళాశాలలో ఉన్న శ్రీ వేటూరి విగ్రహాలకు టీటీడీ విద్యాశాఖాధికారి శ్రీ భాస్కర్ రెడ్డి, శ్వేత సంచాలకులు శ్రీమతి ప్రశాంతి, కళాశాల ప్రిన్సిపాల్ డా. కె. నారాయణస్వామి రెడ్డి, అధ్యాపకులు పుష్పమాలలు సమర్పించారు.
అనంతరం కళాశాలలో ప్రిన్సిపాల్ అధ్యక్షతన సభ జరిగింది. వేటూరి వారు టీటీడీ కి అందించిన సేవలు, శ్రీ తాళ్ళ పాక అన్నమాచార్యులు శ్రీ వేంకటేశ్వర స్వామి పై రచించిన కీర్తనలు వెలుగులోకి తేవడానికి చేసిన పరిశోధనల గురించి వక్తలు గుర్తు చేసుకున్నారు
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.