VETURI WORKS EMERGED OUT OF UNIVERSAL BROTHERHOOD-TTD EO _ వేటూరిది విశ్వమానవ కుటుంబం : తితిదే ఈవో శ్రీ ఎల్వీ సుబ్రమణ్యం

TIRUPATI, MARCH 6:  The renowned scholar Sri Veturi Prabhakara Shastri often believed that the universe is his family and entire humanity is his family and his scholarly works emerged out of this noble concept of “Universal Brotherhood”, said TTD EO Sri LV Subramanyam.

Addressing the 125 Birth Anniversary of Sri Veturi Prabhakara Shastri organised by TTD’s Veturi Vangmaya Peetham at Annamacharya Kalamandiram in Tirupati on Wednesday, the TTD EO described Veturi to a “Saint” who attained scholarly wisdom with his great literary works which always focussed on the good of the society. “The students should make it a habit of reading the great works penned by Sri Veturi to lead life of values”, he maintained. The EO said, very soon the statue of this great person will be unveiled at Chennai and a seminar is also in the offing on March 9 at New Delhi at a tribute to the legendary scholar on his 125th Birth Anniversay.

Earlier addressing the occasion the Peetham’s Special Officer Sri Ravva Srihari said, with the encouragement given by TTD EO, the Peetham is taking up several activities to complete some of the scholarly works of Sri Veturi Prabhakara Shastri which were incomplete. “He was the person who took efforts to bring thousands of Annamacharya Sankeertans to lime light. He also pioneered the development of SV Museum”, he added.

Tirupati JEO Sri P Venkatrami Reddy, Peetham’s Advisor Sri Veturi Anandamurthi, Annamacharya Project Director Dr Medasani Mohan and others were also present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

వేటూరిది విశ్వమానవ కుటుంబం : తితిదే ఈవో శ్రీ ఎల్వీ సుబ్రమణ్యం

తిరుపతి, మార్చి 6, 2013: శ్రీమాన్‌ వేటూరి ప్రభాకరశాస్త్రి విశ్వంలోని మానవులందరినీ తమ కుటుంబసభ్యులుగా భావించారని, వారి శ్రేయస్సు కోసమే రచనలు చేశారని తితిదే కార్యనిర్వహణాధికారి శ్రీ ఎల్వీ సుబ్రమణ్యం కొనియాడారు. వేటూరి ప్రభాకరశాస్త్రి 125వ జయంతి సందర్భంగా తితిదే శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి వాఙ్మయపీఠం ఆధ్వర్యంలో తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో బుధవారం సాహితీ సదస్సు నిర్వహించారు.

ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన తితిదే ఈవో శ్రీ ఎల్వీ సుబ్రమణ్యం ప్రసంగిస్తూ సామాన్య కుటుంబంలో జన్మించి సామాన్యులు అనుభవించే అన్ని కష్టాలను అనుభవిస్తూ జాతి ఉద్ధరణ కోసం రచనలు చేసిన ప్రభాకరశాస్త్రిని రుషి పుంగవుడిగా అభివర్ణించారు. ఇలాంటి సదస్సుల ద్వారా వేటూరి భావజాలం వ్యాప్తి చెందుతుందని, ఇది సమాజానికి శ్రేయస్కరమని అన్నారు. ప్రపంచ తెలుగు మహాసభల స్ఫూర్తితో తితిదే ఆధ్వర్యంలో తెలుగు సాహిత్యానికి సంబంధించిన ఇలాంటి సదస్సులు నిర్వహించుకోవడం ముదావహమన్నారు. ప్రభాకరశాస్త్రి సాహిత్యాన్ని విద్యార్థులు అభ్యసిస్తే నైతిక విలువలతోపాటు ఆత్మవిశ్వాసం పెరుగుతుందని తెలిపారు. త్వరలో చెన్నై మహానగరంలో వేటూరి ప్రభాకరశాస్త్రి విగ్రహావిష్కరణ జరుగనుందన్నారు. అదేవిధంగా మార్చి 9వ తేదీన ఢిల్లీ మహానగరంలో వేటూరి జయంతి కార్యక్రమం నిర్వహించనున్నామని, సాహితీప్రియులు దీన్ని జయప్రదం చేయాలని కోరారు.
శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి వాఙ్మయపీఠం ప్రత్యేకాధికారి ఆచార్య రవ్వా శ్రీహరి ప్రసంగిస్తూ వేటూరి సాహిత్యాన్ని విస్తృతంగా ప్రచారం చేసేందుకు, అసంపూర్ణంగా ఉన్న ఆయన గ్రంథాలను పూర్తి చేసేందుకు, ఆయన సాహిత్యంపై యవతలో ఆసక్తి పెంచేందుకు కార్యక్రమాలు రూపొందిస్తున్నట్టు తెలిపారు. వేటూరికి తితిదేతో గాఢమైన అనుబంధం ఉందన్నారు. అన్నమయ్య  సంకీర్తనలను మొదట కూర్పు చేసి లోకానికి అందించిన మహానుభావుడు ప్రభాకరశాస్త్రి అని తెలిపారు. దేశంలోని పలు ప్రాంతాలు తిరిగి తిరుమల శ్రీవారికి సంబంధించిన పురాతన, చారిత్రక వస్తువులను సేకరించి తితిదే మ్యూజియంను కూడా ఈయనే ప్రారంభించినట్టు చెప్పారు. ఈయనకు సాహిత్యం ఒక పార్శ్వమైతే, యోగం మరో పార్శ్వమన్నారు. యోగంతో ఎంతోమందికి వ్యాధులను నయం చేసినట్టు వివరించారు.

అనంతరం తితిదే ప్రచురించిన ”వేటూరి వారి పీఠికలు” అనే గ్రంథాన్ని తితిదే ఈవో శ్రీ ఎల్వీ సుబ్రమణ్యం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ”శాస్త్రిగారి రచనలు- జీవితం” అనే అంశంపై శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం తెలుగు విభాగం విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో విజేతలకు ఈవో నగదు బహుమతులు ప్రదానం చేశారు. వీరిలో టి.పవిత్రమ్మ మొదటి బహుమతి, కె.రౌనీ పోలీస్‌ ద్వితీయ బహుమతి, లోకనాథయ్య కన్సొలేషన్‌ బహుమతులు అందుకున్నారు.

అనంతరం ఎస్వీ ప్రాచ్య పరిశోధన సంస్థ ఇన్‌చార్జి డైరెక్టర్‌ డాక్టర్‌ వి.వెంకటరమణారెడ్డి అధ్యక్షతన సాహిత్య సదస్సు జరిగింది. ఇందులో ఆచార్య ఆర్‌.చంథ్రేఖరరెడ్డి ”శాస్త్రిగారి సాహిత్య విమర్శ” అనే అంశంపై, ఆచార్య జి.దామోదరనాయుడు ”శాస్త్రిగారి అనువాద నాటకాలు” అనే అంశంపై, డాక్టర్‌ పి.సి.వేంకటేశ్వర్లు ”శాస్త్రిగారు ప్రాచ్య పరిశోధన సంస్థకు చేసిన సేవ” అనే అంశంపై ఉన్యసించారు. కాగా మధ్యాహ్నం మరో రెండు సాహితీ సదస్సులు జరిగాయి.

ఈ కార్యక్రమంలో తితిదే తిరుపతి జెఈవో శ్రీ పి.వెంకట్రామిరెడ్డి, వాఙ్మయపీఠం ముఖ్య సలహాదారు ఆచార్య వేటూరి ఆనందమూర్తి, అన్నమాచార్య ప్రాజెక్టు సంచాలకులు డాక్టర్‌ మేడసాని మోహన్‌, వాఙ్మయపీఠం కో-ఆర్డినేటర్‌ డాక్టర్‌ బి.రామాచార్యులు, ఇతర సాహితీవేత్తలు  పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.