VETURI’s SERVICES REMEMBERED_ శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి స్ఫూర్తితో పరిశోధనలు సాగించాలి : టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్
Tirupati, 29 August 2017: On the occasion of 67th Death Anniversary of Sri Veturi Prabhakara Shastry, Tirupati JEO Sri P Bhaskar wished that the research scholars should take him as inspiration and do extensive research and come out with innovative works.
After garlanding the bronzestatue of Sri Veturi Prabhakara Shastry at SV Oreintal College in Tirupati on Tuesday, the JEO remembered the great works of Sri Shastry which brought to light various interesting aspects about Tirumala temple and also on the great literary works of Saint Poet Sri Annamacharya. “The students should learn about such great persons and chose righteous way of leading life”, he maintained.
Later Scholars Dr Medasani Mohan, Sri Sarvottama Rao also elaborated on the contributions of Sri Veturi Prabhakara Shastry. College Principal Sri B Surender was also present.
ISSUED BY PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI
శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి స్ఫూర్తితో పరిశోధనలు సాగించాలి : టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్
తిరుపతి, 2017 ఆగస్టు 29: శ్రీమాన్ వేటూరి ప్రభాకరశాస్త్రి స్ఫూర్తితో విద్యార్థులు తెలుగు భాష, సాహిత్య రంగాల్లో విస్త తంగా పరిశోధనలు సాగించాలని టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్ పిలుపునిచ్చారు. శ్రీమాన్ వేటూరి ప్రభాకరశాస్త్రి 67వ వర్ధంతిని పురస్కరించుకుని శ్రీ వేంకటేశ్వర ప్రాచ్య కళాశాల తెలుగు అధ్యయన విభాగం ఆధ్వర్యంలో మంగళవారం కళాశాల ప్రాంగణంలో స్మారకోపన్యాస సభ ఘనంగా జరిగింది.
ప్రాచ్య కళాశాల ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ శ్రీ బానోత్ సురేందర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి జెఈవో ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా జెఈవో ప్రసంగిస్తూ ప్రభాకరశాస్త్రిని సంఘ సంస్కర్తగా అభివర్ణించారు. తన రచనలతో సమాజాన్ని ఎంతగానో చైతన్యపరిచారని తెలిపారు. అన్నమయ్య కీర్తనలకు ప్రాచుర్యం కల్పించేందుకు ప్రభాకరశాస్త్రి ఎంతగానో క షి చేశారని, ఎన్నో పురాతన గ్రంథాలను పరిష్కరించి టిటిడికి అందజేశారని వివరించారు. విద్యార్థులు ఇలాంటి సదస్సులను సద్వినియోగం చేసుకుని పరిశోధనాంశాలుగా మార్చుకోవాలని సూచించారు. విద్యార్థులు జ్ఞానం, సౌశీల్యం, ధైర్యంతో తమ లక్ష్యాలను సాధించాలన్నారు.
ఎస్వీయూ విశ్రాంతాచార్యులు ఆచార్య కె.సర్వోత్తమరావు మాట్లాడుతూ వేటూరి వాఙ్మయాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేశానని తెలిపారు. కవిగా, చరిత్ర పరిశోధకుడిగా, శాసన పరిశోధకుడిగా, ప్రాచీనాంధ్ర సంకలన ప్రచురణకర్తగా సంస్క త రూపకానువాదకర్తగా ప్రభాకరశాస్త్రి తనదైన ముద్ర వేశారని వివరించారు.
శ్రీ శ్రీనివాస భక్తి వాఙ్మయ అధ్యయన సంస్థ ప్రత్యేకాధికారి డా|| మేడసాని మోహన్ మాట్లాడుతూ అన్నమయ్య సంకీర్తనలు, సాహిత్యంపై విశేషకృషి చేసిన శ్రీ ప్రభాకరశాస్త్రి అన్నమాచార్య ఉత్సవాలను కూడా ప్రారంభించారని తెలియజేశారు. జానపద సాహిత్య ప్రోత్సాహకుడిగా, తొలి తెలుగు పదమైన ‘నాగబు’ను గుర్తించిన పరిశోధకుడిగా, తాళపత్ర గ్రంథ వివరణ రచయితగా ఈయన గుర్తింపు పొందారని వివరించారు.
శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి 67వ వర్ధంతి సందర్భంగా ప్రాచ్య కళాశాల విద్యార్థులకు నిర్వహించిన వక్తృత్వ పోటీల్లో విజేతలకు ఈ సందర్భగా బహుమతులు ప్రదానం చేశారు. టిబిఏ తృతీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని ఎం.అశ్విని ప్రథమ బహుమతి, పి.చినరెడ్డెమ్మ ద్వితీయ బహుమతి, జి.చంద్రశేఖర్‌రెడ్డి తృతీయ బహుమతి అందుకున్నారు. వీరికి ఆంధ్ర మహాభారతం పుస్తకాన్ని జెఈవో చేతులమీదుగా బహుమతిగా అందించారు.
శ్రీ వేటూరి విగ్రహానికి ఘనంగా పుష్పాంజలి
శ్రీ వేంకటేశ్వర ప్రాచ్య కళాశాల ప్రాంగణంలోని శ్రీమాన్ వేటూరి ప్రభాకరశాస్త్రికి విగ్రహానికి జెఈవో శ్రీ పోల భాస్కర్ పుష్పాంజలి ఘటించారు. అదేవిధంగా తిరుపతిలోని శ్వేత భవనం ఎదురుగా గల శ్రీ ప్రభాకరశాస్త్రి విగ్రహానికి ప్రాచ్య కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ బానోత్ సురేందర్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమంలో టిటిడి పురాణ ఇతిహాస ప్రాజెక్టు ప్రత్యేకాధికారి డా|| సముద్రాల లక్ష్మణయ్య, డిఈవో శ్రీ ఎం.రామచంద్ర, శ్రీ తరిగొండ వెంగమాంబ ప్రాజెక్టు ప్రత్యేకాధికారి శ్రీకె.జె.కృష్ణమూర్తి, పుస్తక ప్రచురణల విభాగం ప్రత్యేకాధికారి శ్రీ డా|| టి.ఆంజనేయులు, ఎస్వీయు ప్రాచ్య పరిశోధన సంస్థ సహాయ సంచాలకులు డా|| పిసి.వెంకటేశ్వర్లు, ప్రాచ్య కళాశాల అధ్యాపకులు డా|| కె.నారాయణ స్వామిరెడ్డి, శ్రీ కె.లక్ష్మీనారాయణ, శ్రీ ఇ.హేమంత్‌కుమార్ ఇతర సిబ్బంది, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.