VICE-PREZ AND HIS FAMILY MEMBERS HAD LUNCH AT ANNAPRASADA BHAVANAM_ వెంగ‌మాంబ భ‌వ‌నంలో అన్న‌ప్ర‌సాదాలు స్వీక‌రించిన భారత ఉపరాష్ట్రపతి

HIS FAMILY RENDERS ANNAPRASADA SEVA

Tirumala, 4 Jun. 19: The Honourable Vice-President of India, Sri M Venkaiah Naidu had lunch at Matrusri Tarigonda Vengamamba Annaprasada Bhavanam (MTVAC) in Tirumala on Tuesday afternoon.

The Vice-Prez along with 16 other members of his family tasted the delicious food that is being served to pilgrims in the massive Annaprasadam Hall.

Tirumala JEO Sri KS Sreenivasa Raju also accompanied the VIP Protocol delegate.

SRIVARI SEVA BY VICE-PREZ FAMILY

Earlier 16-members from the family of Vice President of India Sri M Venkaiah Naidu, including his spouse Smt. Usha, Daughter Smt Deepa and others rendered service at MTVAC.

All the members got registered for Srivari Seva at the Srivari Seva Sadan on Tuesday morning as per norms. They also took part in Satsang and orientation class held at the Seva Sadan complex.

Later wearing Uniform, Scarves, ID card, apron and gloves, they rendered service in annaprasadam complex. As a part of the seva, they served menu, water, removed the banana leaves after the pilgrims completed their consumption of Annaprasadam.

They expressed immense satisfaction for getting an opportunity to render service to pilgrims.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

వెంగ‌మాంబ భ‌వ‌నంలో అన్న‌ప్ర‌సాదాలు స్వీక‌రించిన భారత ఉపరాష్ట్రపతి

శ్రీ‌వారి సేవ చేసిన కుటుంబస‌భ్యులు

తిరుమల, 2019 జూన్ 04: భారత ఉపరాష్ట్రపతి గౌ|| శ్రీ ఎం.వెంకయ్యనాయుడు మంగళవారం తిరుమ‌ల‌లోని మాతృశ్రీ త‌రిగొండ వెంగ‌మాంబ అన్న‌ప్ర‌సాద భ‌వ‌నంలో సాధార‌ణ భ‌క్తుల‌తో క‌లిసి అన్న‌ప్ర‌సాదాలు స్వీక‌రించారు.

అన్న‌ప్ర‌సాద భ‌వ‌నానికి చేరుకున్న గౌ.. ఉప‌రాష్ట్ర‌ప‌తి ప‌లువురు భ‌క్తుల‌తో ముచ్చ‌టించారు. అన్న‌ప్ర‌సాదాలు బాగున్నాయంటూ ప‌లువురు భ‌క్తులు సంతోషం వ్య‌క్తం చేశారు. అనంత‌రం కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి అన్న‌ప్ర‌సాదాలు స్వీక‌రించారు.

ఈ కార్య‌క్ర‌మంలో టిటిడి తిరుమ‌ల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీ‌నివాస‌రాజు, అన్న‌ప్ర‌సాదం ప్ర‌త్యేకాధికారి శ్రీ వేణుగోపాల్‌, క్యాట‌రింగ్ అధికారి శ్రీ జిఎల్ఎన్‌.శాస్త్రి ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

అన్న‌ప్ర‌సాద‌ భ‌వ‌నంలో గౌ..ఉప‌రాష్ట్ర‌ప‌తి కుటుంబ స‌భ్యుల శ్రీ‌వారి సేవ‌

గౌ.. ఉప‌రాష్ట్ర‌ప‌తి కుటుంబ స‌భ్యులు 16 మంది మంగ‌ళ‌వారం తిరుమ‌ల‌లోని అన్న‌ప్ర‌సాద భ‌వ‌నంలో శ్రీ‌వారి సేవ చేశారు. వీరిలో గౌ.. ఉప‌రాష్ట్ర‌ప‌తి స‌తీమ‌ణి శ్రీ‌మ‌తి ఎం.ఉష‌, కుమార్తె శ్రీ‌మ‌తి దీపా వెంక‌ట్, మ‌న‌వ‌ళ్లు, మ‌న‌వ‌రాళ్లు త‌దిత‌రులు ఉన్నారు. ముందుగా వీరు క‌ల్యాణ‌వేదిక వెనుక‌వైపుగ‌ల శ్రీ‌వారి సేవా స‌ద‌న్‌లో పేర్లు న‌మోదు చేసుకున్నారు. మూడు రోజుల పాటు సేవ‌లందించేందుకు వీలుగా స్లాట్‌ను పొందారు. న‌మోదు చేసుకున్న అనంత‌రం శ్రీ‌వారి సేవా స‌ద‌న్‌లో జ‌రిగిన స‌త్సంగంలో పాల్గొన్నారు. భ‌క్తుల‌కు ఎలా సేవ‌లందించాల‌నే విష‌యంపై అవ‌గాహ‌న పెంచుకున్నారు.

మొద‌టిరోజు అన్న‌ప్ర‌సాద‌ భ‌వ‌నంలో శ్రీ‌వారి సేవ‌కులుగా సేవ‌లందించారు. అంద‌రూ యూనిఫాం, స్కార్ఫ్‌లు, గుర్తింపుకార్డులు, ఆఫ్రాన్‌, గ్లోవ్స్ ధ‌రించారు. భ‌క్తుల‌కు అరిటాకులు వేయ‌డం, తాగునీరు అందించ‌డం, అన్న‌ప్ర‌సాదాలు వ‌డ్డించ‌డం, తిరిగి అరిటాకులు తొల‌గించ‌డం లాంటి సేవ‌లు చేశారు. రెండోరోజు ఉద్యాన‌వ‌న విభాగంలో, మూడో రోజు ల‌డ్డూ కౌంట‌ర్ల‌లో వీరు భ‌క్తుల‌కు సేవ‌లందించ‌నున్నారు. తిరుమ‌ల‌లో భ‌క్తుల‌కు సేవ‌లందించే అవ‌కాశం రావ‌డం ప‌ట్ల‌ గౌ.. ఉప‌రాష్ట్ర‌ప‌తి కుటుంబ స‌భ్యులు పూర్తి సంతృప్తి వ్య‌క్తం చేశారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.