YOU ARE THE FUTURE TORCH BEARERS OF OUR SANATANA DHARMA-VICE-PREZ TO VEDIC STUDENTS_ వేద విద్యార్థులు నవభారత ఋషులు : భారత ఉపరాష్ట్రపతి గౌ|| శ్రీ ఎం.వెంకయ్యనాయుడు
Tirumala, 4 Jun. 19: Describing the students of TTD’s Veda Vignana Peetham as “Nava Yuva Rushi”, Sri M Venkaiah Naidu, the Honourable Vice-President of India said, they are the future torchbearers of Hindu Sanantana Dharma.
During his visit Veda Vignana Peetham at Dharmagiri in Tirumala on Tuesday along with Tirumala JEO Sri KS Sreenivasa Raju, the Vice-President was given a warm welcome by the faculty and students of this Veda Pathashala in a traditional way with Rig, Yajur, Sama, Adharvana Veda mantras.
Later addressing the vedic students, the Vice-Prez said that Vedas are not a religion or either man-made. Veda means wisdom and it originated from the words spelled by the Creator Himself. Vedas are the base for the emergence of the Scientific evolution in India. The vedic students should take up extensive research on the significance of various religious components narrated in Vedas in a scientific manner”, he added.
“When extensive research works are going on in Germany on Vedas, little is being done in its own motherland. The Vedic students should rise to the occasion and take up rigorous and in depth research on the various components explained in Vedas”, he strongly opined.
Later he lauded TTD for taking forward the legacy of Vedic education as a part of its promotion of Hindu Sanatana Dharma and complimented the students of Vedic Pathashala for taking the traditional course.
Earlier Sri GAV Dikshitulu, Pancharathra Agama Pundit elaborated on the historical background of the Veda Pathashala which was set up in 1884. In-charge Principal Sri Seshadri Ghanapati, Vaikhanasa Agama Pundit Sri N Mohanarangacharyulu, students of all courses were also present.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI
వేద విద్యార్థులు నవభారత ఋషులు : భారత ఉపరాష్ట్రపతి గౌ|| శ్రీ ఎం.వెంకయ్యనాయుడు
తిరుమల, 2019 జూన్ 04: వేద విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు భవిష్యత్తులో నవభారత ఋషులుగా ఎదగాలని భారత ఉపరాష్ట్రపతి గౌ|| శ్రీ ఎం.వెంకయ్యనాయుడు ఆకాంక్షించారు. తిరుమలకు మూడు రోజుల పర్యటన కోసం విచ్చేసిన గౌ.. ఉపరాష్ట్రపతి మంగళవారం ధర్మగిరి వేదపాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా వారికి వేదపండితులు వేదాశీర్వచనం అందించారు. ఈ కార్యక్రమంలో టిటిడి తిరుమల జెఈవో శ్రీ కెఎస్.శ్రీనివాసరాజు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా గౌ.. ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ వేదం అంటే విజ్ఞానం అని, ప్రపంచం ఎలా ఉండాలో చెప్పే శక్తి వేదాలకు ఉందని తెలిపారు. వేదాల్లోని విజ్ఞానాన్ని వెలికితీసి ఆధునిక సమాజం ఎదుర్కొంటున్న సరికొత్త సవాళ్లకు పరిష్కారం చూపాలన్నారు. వేదాలను అందరికీ చేరువ చేసేందుకు వీలుగా భారతీయ భాషల్లోకి అనువదించాలని సూచించారు. పండితులు వేదమంత్రాలను పఠించినపుడు, వాటి అర్థాన్ని కూడా తెలియజేస్తే పదికాలాల పాటు నిలిచిపోతాయన్నారు. వేద విద్యార్థులు ధర్మాధర్మాలను శాస్త్రాల ద్వారా తెలుసుకుని ప్రజాహితం కోసం సలహాలు ఇవ్వాలని కోరారు. హిందూ అనేది ఒక మతం కాదని, జీవన విధానమని, ప్రకృతితో కలిసి జీవించాలనే విషయాన్ని బోధిస్తుందని తెలియజేశారు. ఎవరికి అప్పగించిన పని వారు చేస్తే ఆనందమని, ఇతరులకు కూడా సాయపడితే మహదానందమని అన్నారు. టిటిడి నిధులను భక్తుల సౌకర్యాల కల్పనతోపాటు హిందూ ధర్మపరిరక్షణకు మాత్రమే ఖర్చు పెట్టాలన్నారు.
అంతకుముందు పలువురు వేద విద్యార్థులు రుగ్వేదం, శుక్లయజుర్వేదం, కృష్ణయజుర్వేదం-తైత్తిరీయశాఖ, సామవేదం – కౌతుమశాఖ, అధర్వణ వేదం, ద్రవిడ వేదమైన దివ్యప్రబంధాన్ని చక్కగా పారాయణం చేశారు. అధ్యాపకులు, విద్యార్థులు కలిసి పురుషసూక్తాన్ని పారాయణం చేశారు.
ఈ సందర్భంగా వేదపాఠశాల పాంచరాత్ర ఆగమపండితుడు శ్రీ జిఎవి.దీక్షితులు మాట్లాడుతూ వేదపాఠశాల ప్రస్థానాన్ని వివరించారు. ప్రస్తుతం 17 విభాగాల్లో 600 మంది విద్యార్థులు, బోధన, బోధనేతర సిబ్బంది కలిపి 60 మంది ఉన్నారని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో వేద పాఠశాల ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ శ్రీ శేషాద్రి ఘనాపాఠి, వైఖానస ఆగమ సలహాదారులు శ్రీ ఎన్.మోహనరంగాచార్యులు, ఇతర అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.