VIGILANCE SLEUTHS SIEGE PROHIBITED GOODS AT ALIPIRI CHECK POST_ అలిపిరి చెక్ పాయింట్ వద్ద విస్తృత తనిఖీలు
Tirumala, 18 July 2017: The TTD Vigilance and SPF sleuths siege various prohibited goods at Alipiri Check Post on Tuesday during checking.
Six liquor bottles, Gutka Packets and six touts carrying laddus were caught in the check. TTD CVSO Sri A Ravi Krishna complimented the cops for catching hold of the culprits in the raids.
Later in Tirumala, the CVSO inspected the aged and physically challenged lines and received the feedback from this category of pilgrims. He also inspected Akshaya Canteen in Tirumala and shifted 16 beggars identified at various places in Tirumala. The chief cop of TTD also recommended for departmental action against 14 barbers in Kalyanakatta. VGO Sri Ravindra Reddy was also present.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI
అలిపిరి చెక్ పాయింట్ వద్ద విస్తృత తనిఖీలు
టిటిడి విజిలెన్స్, ఎస్‌పిఎఫ్ సిబ్బందికి సివిఎస్‌వో శ్రీ ఎ.రవికృష్ణ అభినందనలు
తిరుమల, 2017 జూలై 18: అలిపిరి చెక్ పాయింట్ వద్ద టిటిడి విజిలెన్స్, ఎస్‌పిఎఫ్ సిబ్బంది మంగళవారం విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో 6 మద్యం సీసాలు, గుట్కా ప్యాకెట్లు, ఆరుగురు లడ్డూ దళారులను గుర్తించారు. ఈ సందర్భంగా అలిపిరి చెక్‌పోస్ట్ తనిఖీలను పకడ్బందీగా నిర్వహిస్తున్న విజిలెన్స్ సిబ్బంది శ్రీ జి.తిరుపతిరావు, శ్రీ నాగేంద్రలకు టిటిడి సివిఎస్‌వో శ్రీఎ.రవికృష్ణ రివార్డు ప్రకటించారు. ఏవీఎస్‌వో శ్రీ గంగరాజు, ఎస్‌పిఎఫ్ డిఎస్పీ శ్రీ శంకర్‌రావులను ఆయన అభినందించారు.
అనంతరం సివిఎస్‌వో శ్రీ ఎ.రవికృష్ణ తిరుమల చేరుకుని వైకుంఠం క్యూ కాంప్లెక్స్-2లోని క్యూలైన్లను పరిశీలించారు. వృద్ధులు, దివ్యాంగుల క్యూలెన్లను పరిశీలించి వారికి ఎదురవుతున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా అక్షయ క్యాంటిన్‌ను తనిఖీ చేశారు. తిరుమలలో వివిధ ప్రాంతాలలో 16 మంది యాచకులను గుర్తించి తిరుపతికి తరలించారు. కల్యాణకట్టలో 14 మంది క్షురకులపై శాఖాపరమైన చర్యలకు సిఫార్సు చేశారు. సివిఎస్‌వో వెంట విజివో శ్రీరవీంద్రారెడ్డి ఉన్నారు.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.