VIGRAHA STHAPANA HELD _ రంపచోడవరంలో శాస్త్రోక్తంగా విగ్రహస్థాపన
TIRUPATI, 21 MAY 2023: The religious ritual of Vigraha Sthapana was held in Srivari temple at Rampachodavaram in Alluri Sitarama Raju district on Sunday.
Vaidika programs like Ratnanyasam, Dhatunyasam, etc.were observed followed by Mahashanti, Purnahuti, Chaturdasa Kala Snapanam,, Nava Kalasa Snapanam etc.in the evening.
TTD JEO Sri Veerabrahmam, Agama Advisor Sri Ramakrishna Deekshitulu, SE Sri Satyanarayana, DyEOs Sri Venkataiah, Sri Gunabhushan Reddy, Sri Siva Prasada, VGO Sri Manohar and others were present.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI
రంపచోడవరంలో శాస్త్రోక్తంగా విగ్రహస్థాపన
– మే 22న మహాసంప్రోక్షణ, శ్రీవారి కల్యాణోత్సవం
తిరుపతి, 2023 మే 21: అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరంలో టీటీడీ నూతనంగా నిర్మించిన శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయ విగ్రహస్థాపన ఆదివారం శాస్త్రోక్తంగా జరిగింది.
ఈ సందర్భంగా ఉదయం 9 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు బింబశుద్ధి కోసం
శ్రీ వేంకటేశ్వరస్వామి, శ్రీ పద్మావతి అమ్మవారు, శ్రీ గోదాదేవి, శ్రీ గరుడాళ్వార్, ద్వారపాలకుల విగ్రహాలను మంత్రపూరితమైన పవిత్ర జలంతో అభిషేకం చేశారు. అంతకుముందు యాగశాలలో వైదిక కార్యక్రమాలు, రత్నన్యాసం, ధాతున్యాసం, ఆలయానికి, రాజగోపురానికి విమానకలశస్థాపన, విగ్రహస్థాపన చేపట్టారు. సాయంత్రం 4 గంటలకు మహా శాంతి, పూర్ణాహుతి, చతుర్దశ కలశస్నపనం, నవకలశస్నపనం, మహాశాంతి తిరుమంజనం నిర్వహించారు.
రాత్రి 8 గంటలకు యాగశాల వైదిక కార్యక్రమాలు, రక్షాబంధనం, శయనాధివాసం, విశేష హోమాలు నిర్వహిస్తారు.
ఈ కార్యక్రమంలో జేఈవో శ్రీ వీరబ్రహ్మం, ఆగమ సలహాదారు శ్రీ రామకృష్ణ దీక్షితులు, ఎస్ ఈ శ్రీ సత్యనారాయణ, విజివో శ్రీ మనోహర్, డెప్యూటీ ఈవోలు శ్రీ గుణభూషణ్ రెడ్డి, శ్రీ వెంకటయ్య, శ్రీ శివప్రసాద్, డెప్యూటీ ఈఈలు శ్రీఆనంద రామ్, శ్రీ నాగభూషణం, శ్రీ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
మే 22న మహాసంప్రోక్షణ, శ్రీవారి కల్యాణోత్సవం
మే 22న ఉదయం 5 గంటల నుండి 8.15 గంటల వరకు సుప్రభాతం , యాగశాల కైంకర్యాలు.
ఉదయం 8-15గంటల నుండి 8.45 గంటల వరకు మహా పూర్ణాహుతి.
ఉదయం 8-45 గంటల నుండి 9గంటల వరకు యాత్రదానం, కుంభ ప్రదక్షణ
ఉదయం 9 నుంచి 9.30 గంటల వరకు మిథున లగ్నంలో కళా వాహన , అక్షతా రోహణ, బ్రహ్మఘోష , మహా సంప్రోక్షణ.
ఉదయం 10 గంటల నుండి భక్తులకు స్వామివారి దర్శనం.
ఉదయం 11 గంటలకు ధ్వజారోహణం.
సాయంత్రం 5 గంటలకు శ్రీవారి కల్యాణోత్సవం. తిరువీధి ఉత్సవం , ధ్వజావరోహణం.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.